Crime : బాయ్స్‌ హాస్టల్ లో అగ్ని ప్రమాదం..కాలి బూడిదయిన సర్టిఫికేట్లు, వస్తువులు!

నారాయణ గూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం బాయ్స్‌ హాస్టల్‌ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొగ్గులకుంట కామినేని హాస్పిటల్‌ ముందు ఉన్న శ్రీనివాస హాస్టల్‌ లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రెచ్చిపోయిన మందుబాబు..అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్‎కు నిప్పు..!!
New Update

హైదరాబాద్‌ నగరంలో అగ్ని ప్రమాదాలు నిత్యం ఏదోక మూల జరుగుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నారాయణ గూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం బాయ్స్‌ హాస్టల్‌ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొగ్గులకుంట కామినేని హాస్పిటల్‌ ముందు ఉన్న శ్రీనివాస హాస్టల్‌ లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్ లోపల 8 మంది యువకులు ఉన్నారు. వారిని పోలీసు అధికారులు కాపాడారు. హాస్టల్‌ లోని రెండవ అంతస్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సరైన సమయంలో అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఎప్పుడూ కూడా హాస్టల్‌ లో 30 మంది వరకు ఉంటారని..కానీ దసరా సెలవులు నేపథ్యంలో చాలా మంది సొంతూర్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. గదులు చిన్నగా ఉండటంతో పాటు సామాన్లు కూడా ఎక్కువ ఉండడంతో మంటలు ఎక్కువగా వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ లో హాస్టల్‌ ను నడుపుతూ..ఎలాంటి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు సిబ్బంది తెలిపారు. రెండో అంతస్తులో ప్రమాదం జరగగా..అవి మొదటి అంతస్తుకు కూడా చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మొదటి అంతస్తులో కిచెన్‌ లో గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని..అక్కడి వరకు మంటలు వ్యాపించి ఉంటే చాలా పెద్ద ప్రమాదం సంభవించేదని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో కొంత మంది యువకులు సర్టిఫికేట్లు, బట్టలు, ల్యాప్‌ టాప్‌ లు ప్రమాదంలో కాలిపోయాయని హాస్టల్‌ లో యువకులు ఆవేదని వ్యక్తం చేశారు.

కామినేని ఆసుపత్రిలో పని చేసే ఓ యువకుడు జీతం డబ్బులు తీసుకుని హాస్టల్‌ లో పెట్టి ఊరికి వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అతను కన్నీరు మున్నీరు అవుతున్నాడు.

Also read: ఆ హీరోయిన్‌ పెట్టిన పోస్ట్‌ కు అర్థం ఏంటి..బాయ్ ఫ్రెండ్‌ మోసం చేశాడా!

#hyderabad #fire-accident #boys-hostel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe