Fire Accident: తిరుపతిలో ఫ్యాక్టరీ గోడౌన్‌ బుగ్గిపాలు.. ఏం జరిగిందంటే..?

తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

New Update
Fire Accident: తిరుపతిలో ఫ్యాక్టరీ గోడౌన్‌ బుగ్గిపాలు.. ఏం జరిగిందంటే..?

Fire Accident:  తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోడౌన్‌ యజమానిని ప్రశ్నిస్తున్నారు. ఎంత నష్టం జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని అధికారులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు