Fire accident: బయ్యారంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మొక్కజొన్న పంట! మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంబా తండాలో గుర్తు తెలియని వ్యక్తులు అడవి ప్రాంతంలో మంటపెట్టడంతో అది మొక్కజొన్న పంటకు అంటుకుని పూర్తిగా కాలి బూడిదైంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. By srinivas 28 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Mahaboobnagar: మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంబా తండాలో గురువారం అనుకోకుండా చెలరేగిన మంటల కారణంగా భారీ మొత్తంలో 5ఎకరాల మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. కళ్లముందే చేతికొచ్చిన పంట మంటల్లో మాడిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు బాదుకున్న రైతులు.. ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య శ్రీ రాములు అనే రైతు పంట 2 ఎకరాలు, బోడ లస్కర్ 1ఎకరం, బోడమంగి లాల్ 2ఎకరాలు కాలిపోయాయి. కూలీలతో కంకులు పొట్టుతీసి పొలంలో కుప్పలు పోసి ఇంటికి వెళ్లారు. అయితే సాయంత్రం సమయంలో తిరిగి పొలం వద్దకు వచ్చేసరికి మొక్క జొన్న అంటుకున్నది గమనించి ఆర్పేందుకు చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ కంట్రోల్ కాలేదని, ఏమీ చేయలేక గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరయ్యారని తెలిపారు. ఇది కూడా చదవండి: Parineeti: ఆ బట్టలేసుకుంటే ప్రెగ్నెంట్ అయినట్లేనా.. పరిణీతి ఫైర్! ఇక దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. నర్సాపురం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తునికాకు ప్రూనింగ్ కాంట్రాక్టర్ కూలీలు అటవి ప్రాంతంలో నిప్పు పెట్టడంతో గాలి వాటానికి తమ మొక్క జొన్న పంటకు అంటిపోవడంతో కాలి బూడిద అయినట్లు తెలిపారు. రైతులు తీవ్రంగా నష్ణ పోయామంటూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. #fire-accident #mahaboobnagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి