/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-14T160150.477.jpg)
Fire accident: ఢిల్లీలోని ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. 10 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fire breaks out in the Income Tax office in Delhi, 10 fire tenders rushed to the spot. Details awaited.
— ANI (@ANI) May 14, 2024
ఈ మేరకు న్యూఢిల్లీలోని ఐటీఓ ఏరియాలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ సీఆర్ బిల్డింగ్‌లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు మధ్యాహ్నం 3.07 గంటలకు కాల్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. మేము మొత్తం 21 ఫైర్ టెండర్లను తరలించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు DFS అధికారులు తెలిపారు. ఆ బిల్డింగ్ లో ఉన్న క్షతగాత్రులు కొంతమంది కిటీకి నుంచి దూపి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#BREAKING | Fire breaks out at 4th floor of Income Tax Building in Delhi after fire in AC compressor, 12 fire brigade teams at the spot | #WATCH#Delhi#LatestNews#Videopic.twitter.com/SH3oLIAUYZ
— Republic (@republic) May 14, 2024