PM Modi Speech : కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్.. లోక్ సభలో రాహుల్ ని ఉతికేసిన మోదీ..!! లోక్‌సభలో విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని ప్రత్యర్థులను మోదీ వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి చేరిందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 05 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi Speech : కొత్తపార్లమెంట్ లో కొత్త సంప్రదాయం అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు ప్రధాని మోదీ. ప్రజాస్వామ్య గౌరవం అనేక రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై ఒంటికాలుపై లేచారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, దాని ప్రత్యర్థులను మోదీ వదిలిపెట్టలేదు. ఘాటు విమర్శలు చేస్తూ అందర్నీ ఉతికారేసారు ప్రధాని మోదీ. దేశంలో బీజేపీ హ్యట్రిక్ కొట్టడం ఖాయమన్న మోదీ...భారతదేశంలో మూడవ అతిపెద్ద్ ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఇది మోదీ ఇస్తున్న హామీ అన్నారు. సభలో కాంగ్రెస్ దుమ్ముదులిపిన మోదీ : ప్రతిపక్షాలు ఎక్కువ కాలం ప్రతిపక్షంగా ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ చాలా దశాబ్దాల పాటు ప్రతిపక్షంలో ఉంటుంది. ప్రతిపక్షాల నుంచి కూడా చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయారన్నారు ప్రధాని మోదీ. చాలా మంది తమ సీట్లు మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు చేశారు. చాలా మంది లోక్‌సభకు బదులు రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన చాలా మంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదన్నారు మోదీ. ప్రతిపక్షాలు ప్రతిసారీ దేశాన్ని నిరాశపరిచాయని ప్రధాని అన్నారు. మైనారిటీ పేరుతో ఎంతకాలం విభజన చేస్తారు? సమాజాన్ని విడదీస్తూ ఎంతకాలం ఉంటారు? ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో కూడా ప్రతిపక్షాలకు నేర్పిస్తాను. విపక్షాలు ఎంతకాలం ముక్కలుగా ఆలోచిస్తాయి? కాంగ్రెస్ మంచి ప్రతిపక్షం కాలేకపోయింది. కాంగ్రెస్‌కు మంచి ప్రతిపక్షంగా అవతరించే మంచి అవకాశం వచ్చింది. కానీ పదేళ్లలో ఆ బాధ్యతను కూడా నెరవేర్చలేకపోయిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు: రాహుల్‌ను ప్రయోగించడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి పరిస్థితి చేరుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు. బీజేపీ అంటే కేవలం అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ పార్టీ మాత్రమే కాదు. కానీ కాంగ్రెస్ కుటుంబ పార్టీ. కాంగ్రెస్ కుటుంబంలో చిక్కుకుపోయింది. కాంగ్రెస్ కుటుంబం బయట చూడదు. అదే ఉత్పత్తిని మళ్లీ మళ్లీ విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మోదీ. నేను పదేళ్లలో ఏం చేశానో కాంగ్రెస్‌కు 100 ఏళ్లు పట్టేది: ప్రధాని నేను పదేళ్లలో ఏం చేశానో, కాంగ్రెస్‌కు 100 ఏళ్లు పట్టేదని ప్రధాని మోదీ అన్నారు. 5 తరాలు గడిచిపోతాయి. పట్టణ పేదలకు 80 లక్షల పక్కా ఇళ్లు కట్టించాం. 17 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. కాంగ్రెస్ వ్యూహాల వల్ల ఈ పనికి 60 ఏళ్లు పట్టేది. కాంగ్రెస్ ఎప్పుడూ తనను తాను పాలకునిగా, ప్రజలను చిన్నవాడిగా భావించేదంటూ మోదీ వ్యాఖ్యానించారు. రాహుల్ ఓబీసీని ప్రధానిగా చూడలేరు: ప్రధాని రాహుల్ గాంధీ ఓబీసీల గురించి మాట్లాడుతున్నారని,ఓబీసీ ప్రధాని అయితే రాహుల్ గాంధీ సహించలేరంటూ విమర్శించారు. ఓబీసీ వర్గాన్ని కాంగ్రెస్ అవమానించిందన్న ప్రధాని మోదీ... అత్యంత వెనుకబడిన వారిని కాంగ్రెస్ సహించదంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: నెహ్రూ, ఇందిరాపై మోదీ ఘాటు విమర్శలు.. ఏం అన్నారంటే? #meeting #prime-minister-modi-modis-sharp-criticism #pm-routes #lok-sabha #rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి