PM MODI: నెహ్రూ, ఇందిరాపై మోదీ ఘాటు విమర్శలు.. ఏం అన్నారంటే?

లోకసభలో ప్రధాని మోదీ నెహ్రు, ఇందిరా గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. నెహ్రూ భారతీయులను సోమరులని పిలిచేవారని..ఇందిరాగాంధీ ఆలోచన కూడా చాలా భిన్నంగా ఉండేవన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదన్నమోదీ గాంధీ కుటుంబాన్ని రాజకుటుంబంగా అభివర్ణించారు.

New Update
PM MODI: నెహ్రూ, ఇందిరాపై మోదీ ఘాటు విమర్శలు.. ఏం అన్నారంటే?

PM MODI: కొత్త పార్లమెంట్‌లో కొత్త సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటుందని లోక్‌సభలో ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం గౌరవం అనేక రెట్లు పెరిగిందన్నారు. పార్లమెంటరీ ప్రక్రియకు సెంగోల్ నాయకత్వం వహిస్తున్నారన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పైనా, దాని ప్రత్యర్థులపైనా ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా మూడో టర్మ్‌లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ హామీ అని అన్నారు.

లోకసభలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. నెహ్రూ భారతీయులను సోమరులని పిలిచేవారని..ఇందిరాగాంధీ ఆలోచన కూడా చాలా భిన్నంగా ఉండేవన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదన్నమోదీ గాంధీ కుటుంబాన్ని రాజకుటుంబంగా అభివర్ణించారు.రాష్ట్రపతి ప్రసంగంపై 'ధన్యవాద తీర్మానం'సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 2 గంటలపాటు సాగిన ప్రసంగంలో, భారతీయులు కష్టాల నుండి పారిపోతారనే వ్యాఖ్యపై మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కూడా ఘాటు విమర్శలు చేశారు.

నెహ్రూ, ఇందిరా గాంధీపై మోదీ దాడి:
మాజీ ప్రధాని నెహ్రూ,ఇందిరాగాంధీపై మోదీ ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నెహ్రూ ఎర్రకోట నుండి ఏం చెప్పారో నేను చదువుతాను అంటూ ప్రారంభించారు. 'భారతీయులకు సాధారణంగా చాలా కష్టపడి పనిచేసే అలవాటు లేదు, యూరప్ లేదా జపాన్ లేదా చైనా లేదా రష్యా లేదా అమెరికా ప్రజలలాగా మనం పని చేయము అంటూ ఎగతాళి చేశారంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇందిరాగాంధీ ఆలోచన కూడా నెహ్రూ ఆలోచనకు భిన్నంగా లేవన్నారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట ప్రాకారాల నుండి మాజీ ప్రధాని చెప్పిన కోట్‌ను ప్రస్తావించారు."దురదృష్టవశాత్తూ, మన అలవాటు ఏమిటంటే, కొన్ని శుభ కార్యాలు పూర్తి చేయబోతున్నప్పుడు, మనం ఆత్మసంతృప్తి చెందుతాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం నిరాశ చెందుతాము. కొన్నిసార్లు దేశం మొత్తం విఫలమైనట్లు అనిపిస్తుంది. మనం ఓటమి భావనను స్వీకరించినట్లు అనిపిస్తుంది. అని ఇందిరా గాంధీని ఉటంకిస్తూ ప్రధాని మోదీ అన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదన్నమోదీ.. గాంధీ కుటుంబాన్ని రాజకుటుంబంగా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: కుర్రాళ్లకు కిరాక్ ఆఫర్..10వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు