Fennel Benefits: చాలా మంది ఆహారం కోసం సోంపును ఉపయోగిస్తారు. కానీ ఇది ముఖానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుదని నిపుణులు అంటున్నారు. దీనితో ముఖంలోని మొటిమలను తొలగించుకోవచ్చు. సోంపును ఉపయోగించడం ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. ఫెన్నెల్ తినడంతో పాటు.. ఇది ముఖానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది వేసవిలో తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో సోపు తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ పుష్కలం జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది. ప్రతీరోజు దీన్ని తింటే మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు ముఖానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సోంపుతో ముఖానికి ప్రయోజనాలు:
- ఒక చెంచా ఫెన్నెల్‌ను నీటిలో మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి ప్రతిరోజూ ముఖానికి పట్టించాలి.
- పెరుగు, పాలలో రెండు చెంచాల మైదాపిండిని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 30 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత కడిగేయాలి.
- ఒక పాత్రలో నీటిని మరిగించి.. అందులో కొద్దిగా సోపు వేయాలి. ఆపై 10 నుంచి 15 నిమిషాల పాటు ముఖంపై ఆవిరి పట్టాలి.
- ఆహారంలో సోంపును కూడా చేర్చుకోవచ్చు. దీన్ని రోజూ తింటే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
- వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి, వేడి స్ట్రోక్ నుంచి తప్పించుకోవడానికి సోంఫు బాగా పని చేస్తుంది.
- ఫెన్నెల్‌లో విటమిన్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, జింక్ వంటి అనేక పోషకాలున్నాయి.
- కొందరికి ఫెన్నెల్ వల్ల అలర్జీ రావచ్చు. దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆరెంజ్ తొక్కను ఇలా వాడండి, మీ ముఖం అందంగా మెరిసిపోతుంది!