Sexual assault: హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు. రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని, దీనికోసం సహకరిచాలంటూ రిక్వెస్ట్ చేసిన విద్యార్థిని ఒంటరిగా పిలిచి క్రూరంగా వ్యవహరించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping Issue: ఫోన్‌ట్యాపింగ్‌పై CM రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
లైంగిక కోరిక తీర్చితేనే..
ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని భావించింది. దీని కోసం 44 ఏళ్ల కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ కుమార్ అనుమతి కోరింది. అయితే లైంగిక కోరిక తీర్చితే సహకరిస్తానని ఆ ప్రొఫెసర్ చెప్పాడు. ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి కస్టడిలోకి తీసుకున్నట్లు తెలిపారు.