Shimla: కీచక ఫ్రొఫెసర్.. యూనివర్సిటీ విద్యార్థినిపై దారుణం! హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ఫ్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. రీసెర్చ్ టాపిక్ మార్చుకునేందుకు సహకరించాలని కోరిన విద్యార్థినిపై కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 29 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Sexual assault: హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్ దారుణానికి పాల్పడ్డాడు. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు. రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని, దీనికోసం సహకరిచాలంటూ రిక్వెస్ట్ చేసిన విద్యార్థిని ఒంటరిగా పిలిచి క్రూరంగా వ్యవహరించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా చదవండి: Phone Tapping Issue: ఫోన్‌ట్యాపింగ్‌పై CM రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు లైంగిక కోరిక తీర్చితేనే.. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని రీసెర్చ్ టాపిక్ మార్చుకోవాలని భావించింది. దీని కోసం 44 ఏళ్ల కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజేందర్ కుమార్ అనుమతి కోరింది. అయితే లైంగిక కోరిక తీర్చితే సహకరిస్తానని ఆ ప్రొఫెసర్ చెప్పాడు. ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి కస్టడిలోకి తీసుకున్నట్లు తెలిపారు. #female-student-sexually-assaulted #kangra-central-university-professor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి