Telangana : ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులకు కళ్ళెం...కొత్త చట్టం

తెలంగాణలోని ప్రైవేటు స్కూళ్ళల్లో పీజుల నియంత్రణకు ప్రభుత్వం నడుం కట్టింది. రుసుముల నియంత్రణకు కొత్త చట్టం తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మూడు లేదా నాలుగు నెలల్లో వస్తుందని చెబుతున్నారు విద్యాశాఖా ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం.

New Update
Telangana : ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులకు కళ్ళెం...కొత్త చట్టం

Private Schools In Telangana : రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాల ఫీజుల(Private Schools Fees) నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తామనిచెప్పింది విద్యాశాఖ. మరో 3 లేదా 4 నెలల్లో చట్టాన్ని తీసుకురావడమే కాకుండా వెంటనే అమలు అయ్యేలా చేస్తామని కూడా చెబుతున్నారు విద్యాశాఖా ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం(Burra Venkatesham). ప్రైవేటు స్కూల్స్ ఎవరికి నచ్చినట్టు వారు ఫీజులు పెంచేస్తున్నారని... దాన్ని కంట్రోల్ చేయడానికే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ స్కూల్స్‌ల లాగే ప్రైవేటు స్కూల్స్‌లో కూడా విద్య భారం కాకుండా ఉండేటట్టు చూస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్ధులు పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు బుర్రా వెంకటేశం. సర్కారు బడుల్లో విద్యతో పాటూ వికాసం, సాంస్కృతిక, క్రీడా విభాగాల్లో విద్యార్ధులను తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దాంతో పాటూ ఉపాధ్యాయుల కొరత లేకుండా రేషలైజేషన్ చేపడతామని చెప్పారు. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ల పోస్టు భర్తీ అవుతున్నాయి. అలాగే టెట్ ఫలితాల(TET Results) తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయని చెప్పారు. దాంతో పాటూ వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్ళల్లో ప్రవేశాలు పెంచేందుకు విద్యార్ధుల్లో వ్యక్తిత్వ, మానసిక వికాసం, శరీరదారుఢ్యం పెంపొందించేలా కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. నాలుగు రోజుల పాటూ ఈ శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు.

ఇక ఈ ఏడాది తెలంగాణలో పదోతరగతి ఉత్తీర్ణతా శాతం పెరగిందని..ఇది చాలా మంచి పరిణామమని అన్నారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్ధులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. మళ్ళీ పాస్ అవ్వడానికి ట్రై చేయాలని చెప్పారు. ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసుకుని సప్లిమెంటరీ పరీక్ష రాయాలని హితవు పలికారు.

Also Read:Hyderabad : ఎయిర్ పోర్ట్‌లో చుక్కలు చూపిస్తున్న చిరుత

Advertisment
Advertisment
తాజా కథనాలు