/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-20.jpg)
Husband Pays Friends Rs 2.5 Lakh To Kill Her : మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని దుర్గావతి అనే మహిళ రోడ్డు యాక్పిడెంట్ (Road Accident) లో చనిపోయింది. ఆగస్టు 13న ఇది జరిగింది. ఆరోజు దుర్గావతి తన తమ్ముడితో కలిసి బైక్ మీద వస్తుండగా లోడింగ్ వాహనం ఢీకొట్టి చనిపోయిందని దుర్గావతి భర్త అజయ్ పోలీసులకు చెప్పాడు. యాక్సిడెంట్‌లో దుర్గావతి తమ్ముడు సంజయ్‌కు గాయాలయ్యాయి అని కూడా చెప్పాడు. దాంతో పోలీసులు యాక్సిడెంట్ కేసుగానే నమోదు చేశారు. కానీ తరువాత చేసిన దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. అది కూడా 11 రోజుల తర్వాత. ప్రమాదం జరిగిందని చెబుతున్న స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు ఆ రోజు అసలు లోడింగ్ వాహనం ప్రయాణించినట్టే కిపించలేదు. కానీ దుర్గావతి వెళుతున్న బైక్ వెనుక ఒక ఎకో స్పోర్ట్ కార్ ఉన్నట్టు మాత్రం గుర్తించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. విచారణ ముమ్మురం చేశారు. ఇందులో భాగంగా దుర్గావతి భర్త అజయ్‌ను మళ్ళీ ప్రశ్నించారు. లోడింగ్ వెహికలా కాదా అని అడిగారు. దానికి అతను కారు కూడా కావచ్చంటూ..మాట మార్చాడు. దీంతో పోలీసుల అనుమానం బలపడింది.
తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు..అజయ్ చెప్పిన సమాధానాలు అతకకపోవడంతో...అతని గురించి ఆరా తీశారు. దాంతో అయ్యగారి బండార అంతా బయటపడింది. అజయ్ దుర్గావతిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. అజయ్, దుర్గావతి ముందు ప్రేమించుకున్నారు. కానీ ఏవో కారణాలతో ఆమె వేరే అతనిని పెళ్ళి చేసుకుంది. అజయ్ కూడా ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయిన కొన్నాళ్ళకే దుర్గావతి తన భర్తతో విడిపోయి తన ఇంటికి వచ్చేసింది. ఆ తరువాత అజయ్ కు మళ్ళీ దగ్గరయింది. దీంతో వీరిద్దరూ మళ్ళీ 2023లో పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉండడం ప్రారంభించారు. కానీ దుర్గావతి షాపింగ్ కోసం చలా ఎక్కువ ఖర్చు చేసేది. ఇది అజయ్‌కు నచ్చలేదు. ఆమె షాపింగ్ (Shopping) వల్ల అతని ఆర్తి పరిస్థితి కూడా దిగజారింది. ఆ కోపంతో తన ఫ్రెండ్‌కు 2.5 లక్షలు ఇచ్చి దుర్గావతిని హత్య చేయించాడు. పోలీసుల విచారణ తర్వాత అజయ్ తన నేరాన్ని ఒప్పుకోవడంతో..వారు అతనిని అరెస్ట్ చేశారు.
Also Read: Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీలు ఎందుకు లేరు–రాహుల్ గాంధీ