Crime News: అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు.. భార్యను క్రూరంగా చంపి ఏం చేశాడంటే?

భార్యను అత్యంత దారుణంగా చంపి పారిపోయిన వ్యక్తి కోసం అమెరికా పోలీసులు గత 9ఏండ్లుగా జల్లెడపడుతున్నారు. అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు. అతనిపై రూ. 2కోట్ల రివార్డును కూడా ప్రకటించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎక్కడున్నాడు? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Crime News: అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు.. భార్యను క్రూరంగా చంపి ఏం చేశాడంటే?

Crime News: 9ఏండ్ల క్రితం అమెరికాలో భార్యను అత్యంత క్రూరంగా చంపి పరారైన భారతీయ వ్యక్తి కోసం ఎఫ్ బిఐ ముమ్మరంగా గాలిస్తోంది. అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. తాజాగా నిందితుడి తలపై రూ. 2కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. అతని ఆచూకీ తెలియజేసినవారికి రూ. 2.5లక్షల డాలర్లు అందజేస్తామని పేర్కొంది. 2015 ఏప్రిల్ 12న మేరీ ల్యాండ్ లోని హోనోవర్ లో భారతీయుడు భద్రేశ్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ తన భార్య పాలక్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

ఆయన భార్య పాలక్ స్థానికంగా ఉండే డంకిన్ డోనట్ దుకాణంలో ఉద్యోగం చేసేది. హత్య జరిగిన రోజు వీరిద్దరూ నైట్ షిఫ్టులో ఉన్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత దుకాణం కిచెన్ లో ఉన్న పాలక్ దగ్గరకు వెళ్లిన అతను అమెనను పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాలక్ ఘటనాస్థలంలోనే మరణించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న ఎఫ్ బిఐ నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టింది.

హత్య తర్వాత తన అపార్ట్ మెంట్ కు వచ్చిన భద్రేశ్ కొన్ని వస్తువులను తీసుకుని న్యూజెర్సీ ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. ఆ తర్వాత అతని ఆచూకీ దొరకలేదు. అప్పటి నుంచి నిందితుడి కోసం ఎఫ్ బీఐ గాలిస్తూనే ఉంది. 2017లో అతన్ని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో చేర్చింది. తాజాగా 2.5లక్షల డాలర్ల రివార్డును ప్రకటించింది.

ఇక వీసా గడువు తీరడంతో పాలక్ ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవ షురూ అయ్యింది. చివరకు ఆమెను హత్య చేసే వరకు వెళ్లింది. తిరిగి స్వదేశానికి వెళ్లడం నచ్చని భర్త ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అదికారులు ధ్రువీకరించారు. నిందితుడు భద్రేశ్ కెనడాకు లేదా భారత్ కు తిరిగి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: లోన్స్ తీసుకునే వారికి శుభవార్త చెప్పిన ఆర్బీఐ!

Advertisment
Advertisment
తాజా కథనాలు