Survey Baby Girl: మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా..అయితే తండ్రి ఆయుష్షు పెరిగినట్లే!

పూర్వం కాలంలో ఇంట్లో ఆడపిల్ల(Baby Girl)  పుడితే తండ్రికి భారం పెరగడం వల్ల ఆయువు సగం తగ్గిపోతుంది అనే సామెత ఉండేది. కానీ...ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు 74 వారాలు పెరుగుతుందని తాజా సర్వేలు తెలుపుతున్నాయి.

New Update
Survey Baby Girl: మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా..అయితే తండ్రి ఆయుష్షు పెరిగినట్లే!

పూర్వం కాలంలో ఇంట్లో ఆడపిల్ల(Baby Girl)  పుడితే తండ్రికి భారం పెరగడం వల్ల ఆయువు సగం తగ్గిపోతుంది అనే సామెత ఉండేది. కానీ...ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు 74 వారాలు పెరుగుతుందని తాజా సర్వేలు తెలుపుతున్నాయి. ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారని పోలాండ్‌ లో జరిగిన ఓ సర్వేలో తేలింది.

ఆడపిల్లలు ఉన్న తండ్రుల జీవిత కాలాల్ని, ఆడపిల్లలు లేని తండ్రుల జీవిత కాలాన్ని పోల్చి చూస్తే ఆడపిల్లలు ఉన్న తండ్రుల జీవితకాలం 74 వారాలు అంటే 6 ఏళ్ల జీవితకాలం పెరుగుతుందని సర్వే వివరించింది. ఇంట్లో కూతురు ఉన్న తండ్రి, కొడుకు ఉన్న తండ్రుల మధ్య వ్యత్యాసాన్ని చాలా క్లియర్‌ గా సర్వే లో నిపుణులు గుర్తించినట్లు తెలిపింది.

Also read: ఎమ్మెల్యే మాగంటి పీఏ అరాచకం..వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టి!

ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టు వెల్లడైందని తెలిపారు.మరో సర్వే ప్రకారం పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆయుష్షు పెరుగుతుందని వెల్లడైంది. పుట్టిన బిడ్డలు ఎవరైనా సరే తల్లిదండ్రుల జీవితకాలం పెరగడానికి దోహదపడారని తేలింది. పిల్లలు లేని వారితో పోల్చుకుంటే పిల్లలు ఉన్న వారు ఎక్కువ కాలం సంతోషంగా జీవించే అవకాశాలున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.

ఈ సర్వేల బట్టి అయినా ఆడపిల్లలు కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఆడపిల్లలు ఇంటికి భారం అనుకున్న వారు ఈ విషయాలు తెలుసుకుని ఆడపిల్ల భారం కాదు..వరం అనుకోవాలి. తమ ఆయుష్షును పెంచే దేవతలుగా గుర్తించాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు