Ram narayan Agarwal: మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్ ఈ రోజు మరణించారు. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో ఆయన కన్నుమూశారు. నారాయణ్ వయసు 84 ఏళ్ళు. గత కొంత కాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
రాజస్థాన్లోని జైపుర్లో జన్మించిన నరైన్ బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. తర్వాత ప్రోగ్రాం డైరెక్టర్‌గా , డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1983 లో లాంచ్ అయిన అగ్ని ప్రోగ్రామ్లో విశేష సేవలు అందించారు. అగ్ని మిస్సైల్ కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఆయన పినచేశారు. అందుకే నరైన్ ను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్ అని కూడా అంటారు. తన బృందంతో కలిసి అగర్వాల్ 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీపైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.
భారతదేశ ప్రభుత్వం రామ్ నారాయణ్‌కు 1990లో పద్మశ్రీ, 2000 లో పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.
Also Read: Sweden: స్వీడెన్‌లోనూ ఎంపాక్స్ వైరస్..మొదట కేసు నమోదు