ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నలు నీటి కష్టాలతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే గత 15 నెల రోజుల నుంచి సక్రమంగా కాలువలకు నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని మందపాకల మూడో నెంబర్ పంట కాలవ కింద దాదాపు 30 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. అవి నీరు లేక పూర్తిగా బీడు భూములుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేసేదేమీ లేక రైతులందరూ కూడా బీళ్లుగా మారిన పంట పొలాల్లో తమ ద్విచక్ర వాహనాన్ని తిప్పి నిరసన వ్యక్తం చేశారు. సాగునీటి కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఒకపక్క వర్షాలు పడకపోవడం, మరోపక్క కాలువలకు సక్రమంగా నీరు రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమిలేక పంట పొలాల్లో వాహనాలు తిప్పి ఇలా నిరసన తెలుపుతున్నానమ్నారు.
ఇప్పటివరకు రాజకీయ నాయకులే ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా.. ఇప్పుడు ఓపిక నశించిన రైతులు కూడా చేసేదేమి లేక తమ పంట పొలాల్లో వాహనాలు తిప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి పంట పొలాలకు నీరు విడుదల చేసి తమను ఆదుకోవాలని మందపాకల రైతులు డిమాండ్ చేస్తున్నారు.