Runa Mafi: రైతు రుణమాఫీకి సాఫ్ట్‌వేర్ చిక్కులు.. అక్షరం తేడా ఉన్నా రద్దు! సాంకేతిక లోపాల కారణంగా రుణమాఫీ ఆగిపోయిందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాల్లో చిన్న అక్షరం తేడా ఉన్నా రుణమాఫి జాబితా నుంచి తమ పేర్లను తొలగించినట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్హులకు కూడా అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. By srinivas 05 Aug 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Runa Mafi: తెలంగాణలో రైతు రుణమాఫీకి కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది లబ్దిదారులు తమ ఖాతాల్లో డబ్బులు పడలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్నప్పటికీ రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదని వాపోతున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా ఎంపిక, ఆధార్ సీడింగ్‌లో తప్పుల కారణంగా అర్హులకు అన్యాయం జరుగుతోందని, పేరు, ఇంటి పేరు, ఆధార్ కార్డుపై చిరునామా, బ్యాంకు ఖాతా వివరాల్లో చిన్న తేడాలున్నా లబ్ధిదారుల జాబితా నుంచి తమ పేర్లను తొలగిస్తున్నట్లు ఆందోళనకు గురవుతున్నారు. అన్నదమ్ములు ఇద్దరు వేర్వేరుగా ఉంటే.. ఒక కుటుంబంలో భార్య, భర్త, తల్లి ముగ్గురు ఉంటే వారికి వేర్వేరుగా పట్టాదారు పాస్‌పుస్తకాలున్నాయి. తల్లి చనిపోవటంతో రెవెన్యూ శాఖ పాస్‌బుక్కును రద్దు చేసింది. భార్యాభర్తలకు పాస్‌బుక్కులు అలాగే ఉన్నాయి. అయితే తల్లితోపాటు ఒకే రేషన్‌కార్డులో వారి పేర్లు ఉండటంతో కొడుకు, కోడలు రుణమాఫీని కూడా ఆపేశారు. ఇక అన్నదమ్ములు ఇద్దరు వేర్వేరుగా ఉంటే.. వారిని ఒకే ఆధార్ నెంబరు కింద తీసుకొని పెండింగ్ పెట్టారని తెలిపారు. ఎంపికలోనే చాలా తప్పులు.. ఇక రుణమాఫీ లబ్ధిదారుల జాబితా తయారీ, డేటా ప్రాసెసింగ్, రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబాన్ని ఎంపిక చేయడంలో తప్పులు దొర్లాయి. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో రూపొందించిన రైతుల జాబితాలు, నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ)లో ప్రాసెసింగ్ లోపాలు ఇందుకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. ఓ రైతుకు రూ.లక్ష అప్పు ఉంటే.. రూ.21 వేలు మాత్రమే మాఫీ అయిందని తెలిపారు. వ్యవసాయాధికారిని అడిగితే, బ్యాంకుకు వెళ్లి అడగాలని చెప్పారు. బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం నుంచి ఇంతే మంజూరైందంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది కూడా చదవండి: KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు! కెనరా బ్యాంకు కస్టమర్లకు షాక్.. కెనరా బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. బ్యాంకులో రైతుల పేరుమీద సాధారణ ఖాతా వేరుగా ఉంటుంది. ఆ రైతు రుణం తీసుకుంటే లోన్ అకౌంట్‌ను వేరుగా తెరుస్తారు. రుణాన్ని రెన్యువల్ చేసినప్పుడు లోన్ అకౌంట్‌ను క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ కొత్త లోన్ అకౌంట్ తీస్తారు. అయితే కెనరా బ్యాంకులో రైతుల రుణాలు రెన్యువల్ చేసిన సమయంలో లోన్ అకౌంట్లు మార్చలేదు. పాత లోన్ అకౌంట్లతోనే రెన్యువల్ చేశారు. ఇప్పుడు పాత లోన్ అకౌంట్లు రుణమాఫీ జాబితాలోకి రాలేదు. కేవలం కటాఫ్ తేదీ లోపల కెనరా బ్యాంకులో కొత్తగా క్రాప్ లోన్ తీసుకున్న రైతులకే రుణమాఫీ వర్తించింది. బ్యాంకులో ఆరాతీస్తే పాత ఖాతాదారులకు రుణమాఫీ వర్తించలేదని చెప్పడం గమనార్హం. కాగా చాలామంది రైతులు రుణమాఫీ లబ్ది పొందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. #rythu-runa-mafi #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి