Farmers Protest: రైతులకు ఇబ్బంది కలిగించారో !.. రాకేష్ టికైత్ హెచ్చరిక

తమ డిమాండ్ల పరిష్కరణ కోసం ఢిల్లీ బయలదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఊరుకోమని భారతీయ కిసాన్‌ యూనియన్ (BKU) అధినేత రాకేష్‌ టికైత్ హెచ్చరించారు. ఈ విషయంలో రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.

New Update
Farmers Protest: రైతులకు ఇబ్బంది కలిగించారో !.. రాకేష్ టికైత్ హెచ్చరిక

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఢిల్లీ చలో పేరిట.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్‌ యూనియన్ (BKU) అధినేత రాకేష్‌ టికైత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బయలదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశంలో ఎన్నో రైతు సంఘాలున్నాయని.. ఒక్కో సంఘానికి ఒక్కో సమస్య ఉందని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ బయలుదేరిన రైతులకు ఇబ్బందలుకు కలిగించొద్దని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే జోరు.. టైమ్స్ నౌ సంచలన సర్వే

నా మద్దతు ఉంటుంది

రైతులకు తాము దూరంగా లేమని.. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావడం, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసుల కొట్టివేతలు వంటి డిమాండ్లతో ఢిల్లీ చలో నిరసన చేపట్టిన రైతులకు తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020-21 సంవంత్సరంలో పెద్ద ఎత్తున రైతులు చేపట్టిన నిరసనలో రాకేష్ టికైత్ కీలక పాత్రను పోషించారు.

తక్షణమే తీసుకురాలేం

మరోవైపు రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం.. వారితో చర్చలు జరపాలని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ టికైత్ కోరారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి అర్జున్ ముండా స్పందించారు. కనీస మద్దతు ధరపై తక్షణమే చట్టం తీసుకురాలేమని తెలిపారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు దీనిపై స్పందించిన కాంగ్రెస్‌.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. తాము అధికారంలోకి వస్తే.. ప్రతి రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది.

Also Read: డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల కోసం కొత్త పథకం.. ఏటా రూ.9 వేలు సాయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు