Kajal Agarwal : పబ్లిక్ లో కాజల్ తో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని.. నటి ఏమన్నారంటే!

టాలీవుడ్‌ అందాల ముద్దుగుమ్మ కాజల్ కి పబ్లిక్‌లో ఓ షాకింగ్‌ ఘటన ఎదురరైంది.ఓ ఆకతాయి... ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కావాలని వచ్చి ఒక్కసారిగా కాజల్ నడుము మీద చేయి వేశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాజల్‌ వెంటనే పక్కకి జరిగింది.

New Update
Kajal Agarwal : పబ్లిక్ లో కాజల్ తో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని.. నటి ఏమన్నారంటే!

Kajal Fan : టాలీవుడ్‌(Tollywood) అందాల ముద్దుగుమ్మ కాజల్(Kajal) కి పబ్లిక్‌లో ఓ షాకింగ్‌ ఘటన ఎదురరైంది. మంగళవారం కాజల్‌ అగర్వాల్‌ హైదరాబాద్(Hyderabad) లోని ఓ బట్టల దుకాణాన్ని ప్రారంభించడానికి వెళ్లింది. దాని ప్రారంభోత్సవం తరువాత ఆమె అభిమానులతో సెల్ఫీలు దిగడానికి వచ్చింది. దీంతో ఆమె వైపు ఒక్కసారిగా అభిమానులు ఆమె మీదకు దూసుకొచ్చారు.

ఇదే అదనుగా భావించిన ఓ ఆకతాయి... ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కావాలని వచ్చి ఒక్కసారిగా కాజల్ నడుము మీద చేయి వేశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాజల్‌ వెంటనే పక్కకి జరిగింది. విషయాన్ని గమనించిన ఆమె బౌన్సర్లు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్‌ కావడంతో కాజల్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కాజల్‌ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తరువాత కాజల్‌ మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు అంటే తన కుటుంబంతో సమానమాని అన్నారు.

కాజల్‌ ఓ బిజినెస్‌ మ్యాన్‌ ని వివాహం చేసుకుని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత కాస్త గ్యాప్‌ తీసుకుని భగవంత్‌ కేసరి సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ సత్యభామ, ఇండియన్ 2 సినిమాలతో బిజీగా ఉంది.

Also Read : అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్‌..ఆమె మద్దతు ఎవరికి?

Advertisment
Advertisment
తాజా కథనాలు