కుటుంబ పెత్తనం పోవాలి..బీజేపీ వైపు ప్రజల చూపు: కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి.. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌పై నిరంతరం పోరాటం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీలో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్ వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి శంషాబాద్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

కుటుంబ పెత్తనం పోవాలి..బీజేపీ వైపు ప్రజల చూపు: కిషన్‌రెడ్డి
New Update

అధికార పార్టీపై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(kishanreddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ మీద అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరం మని..ఆది ఆయన వ్యక్తిగతం విషయం అని అన్నారు. బీజేపీ పార్టీ లంబాడీ(st)సామాజిక వర్గం రిజర్వేషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే లంబాడీలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కిషన్‌రెడ్డి వివరించారు. జనాభాకు అనుకూలంగా గిరిజన రిజర్వేషన్లను పెంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న ఆయన గిరిజన రిజర్వేషన్లను మత రిజర్వేషన్లతో ముడి పెడుతూ.. రాజకీయం చేస్తున్న బీఅర్ఎస్‌కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పొత్తులు పెట్టుకొని పని చేశారు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎత్తేసిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు. ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తోందని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పేరుతో పేదలకు సీఎం కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. దీనికి నిరసనగా నిరసన చేపడుతున్నామన్నారు. ఇద్దరు దళిత మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కార్మిక రంగంలో కీలక పాత్ర పోషించిన సంజీవరావు పార్టీలో చేరారు. వీరి చేరికతో ఉత్తర తెలంగాణలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని..పార్టీ వీరి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుందన్నారు.

బీజేపీని ప్రజలు కోరుకుంటున్నారు

కాంగ్రెస్, ఎంఐఎం(mim)బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో ఈ ముగ్గురు పొత్తులు పెట్టుకొని, కలిసి పని చేశారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బీఅర్ఎస్ (brs) మద్దతిచ్చింది నిజం కదా అన్నారు. పార్లమెంటు అవిశ్వాస తీర్మానంలో ముగ్గురు కలిసి పోవడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నారని అన్నారు. ఇవి కుటుంబాల కోసం పని చేసే పార్టీలు కాదని.. కాంగ్రెస్- బీఆర్ఎస్ అవినీతి, నియంత, కుటుంబ పార్టీలు అన్నారు. దేశం, రాష్ట్రం, ప్రజల కంటే వీరికి కుటుంబంమే ముఖ్యం అన్నారు. బీఅర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకొని హామీలను గాలికి వదిలేసిందన్నారు. అందేకాదు రాష్ట్రంలో కుటుంబ పెత్తనం పోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. దాని కోసమే బీజేపీ (bjp)వైపు ప్రజలు చూస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌(brs)పై నిరంతర పోరాటం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. అతి వర్షాలతో వరదలు వచ్చిన బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం ప్రకటించలేదన్నారు. కేంద్రం ప్రకటించిన రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. కేంద్రం తరపున రాష్ట్రం దగ్గర నిధులు ఉన్నా ఎందుకు సహకారం అందించట్లేదని ? ప్రశ్నించారు. వరద బాధితులకు కనీసం ఆహారం కూడా అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర బృందాలు అక్కడ పర్యటించి వరద సహాయంపై నివేదిక తయారు ఇస్తామన్నారు. బీఆర్ఎస్‌పై నిరంతర పోరాటం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe