Fake Medicine: ఖమ్మం, హైదరాబాద్ లో ఫేక్ మెడిసిన్.. అధికారుల దాడుల్లో షాకింగ్ విషయాలు!

ఫేక్ మెడిసిన్ తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు. ఖమ్మం, హైదరాబాద్ లో దాడులు చేసి భారీగా ఫేక్ మెడిసిన్ ను సీజ్ చేశారు.

New Update
Fake Medicine: ఖమ్మం, హైదరాబాద్ లో ఫేక్ మెడిసిన్.. అధికారుల దాడుల్లో షాకింగ్ విషయాలు!

నకిలీ మందులు (Fake Medicine) తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారి గుట్టును రట్టు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్, ఖమ్మంలో నకిలీ మందుల తయారీపై దాడులు చేశారు. స్పిన్ బయోఫార్మా ల్యాబ్స్ పేరిట ఫార్మాస్యూటికల్ పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని మచ్చబొల్లారం, ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో దాడులు చేసిన అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: ‘ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌’లోకి రామ్‌చరణ్‌ ఎంట్రీ.. ఏ టీమ్ ను కొన్నాడంటే?

మచ్చబొల్లారంలో రూ.4.5 కోట్ల యాంటీ క్యాన్సర్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అన్నారుగూడెంలోనూ భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కడారి సతీష్‌రెడ్డి అనే వ్యక్తి మరికొందరితో కలిసి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

నకిలీ మందులను ల్యాబ్స్‌కు తరలించిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం వీరు మందులు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు? ఎలాంటి మందులు తయారు చేశారు. వాటి వల్ల ఎలాంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది అన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు