Khammam : గ్యాంగ్ (Gang) సినిమా తరహాలో హోటల్లో రైడ్ చేసిన ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు (Fake Food Inspectors) ఖమ్మంలో అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్ లో నలుగురు ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీ అంటూ హల్ చల్ చేశారు. కుళ్లిపోయిన మాంసం, కాలం చెల్లిన నిత్యావసర సరుకులు వినియోగిస్తున్నారంటూ హోటల్ యజమానిపై ఫైర్ అయ్యారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని మండిపడ్డారు. దీంతో హోటల్ యజమాని బెంబేలిత్తి పోయారు.
పూర్తిగా చదవండి..Telangana : గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే?
ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్లో ఆకస్మిక తనిఖీ చేసి హల్చల్ చేశారు. విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని వారిని అరెస్ట్ చేయించారు.
Translate this News: