ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వ లేని కుళ్లుబోతులు మన కళ్ల ముందే తిరుగుతుంటారు. కొంతమంది టీవీల్లో కనిపిస్తుంటారు. నోటికి వచ్చింది మాట్లాడుతూ అడ్డగోళ్ల ప్రచారాలు చేస్తుంటారు. ఒకరి దూకుడును, గెలుపును ఎలా ఎదుర్కొవాలో తెలియక అసత్య ప్రచారాలు చేస్తుంటారు. తెలుగు నంబర్-1 యూట్యూబ్ ఛానెల్‌గా తెలుగునాట విశేష ఆదరణ పొందుతున్న ఆర్టీవీ(RTV)పైనా అదే 'అసత్య' అస్త్రంతో తప్పుడు వార్తలను చిత్రికరీస్తున్నారు. ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పబ్బం గడుపుతున్నాయి.
This browser does not support the video element.
ఈ చెంచా రాతలు ఎందుకు?
ఓ యూట్యూబ్ ఛానెల్, ఓ వెబ్‌సైట్, సోషల్‌మీడియాలో కొందరు పనిగట్టుకోని ఆర్టీవీపై ఫేక్ ప్రచారానికి తెరతీశారు. ఆర్టీవీపై ఈడి దాడులు చేసిందన్నది ఆ ఫేక్ న్యూస్ సారాంశం. నోటికి వచ్చింది చెబుతూ చేతికి వచ్చింది రాస్తూ అవే నిజాలని జనాల్ని బురిడి కొట్టించాలని అనుకుంటే ఎలా? ప్రజలేమీ అంత అమాయకులు కారు. ఆర్టీవీకి ఉన్న ఇంటిగ్రిటీ వారికి తెలియనిది కాదు. ఇలాంటి చెంచా రాతలు,కథనాలు ఎవరూ నమ్మరని ఈ తప్పుడు వార్తల వెనుక ఉన్నవారు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకీ ఫేక్ చెంచా వార్తలు?
నిజానికి మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో కొందరు రాజకీయ పార్టీలకు చెంచాలగా మారారని ప్రజలందరికి తెలుసు. వారంతా ఎన్నికల సమయంలో ఆర్టీవీ దెబ్బకు జెండా ఎత్తేసినట్టే కనిపిస్తున్నారు. అటు ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వెయ్యడంలో ఆర్టీవీ మిగిలిన సంస్థల కంటే సక్సెస్ సాధించింది. అటు వ్యూయర్‌షిప్ విషయంలోనూ ఆర్టీవీ మిగిలిన ఛానెల్స్‌ను బీట్ చేసింది. దీన్ని చూసి ఓర్వలేని కొందరు కుళ్లుబోతులు పనిగట్టుకోని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌తో ఆర్టీవీపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నారు. ఆ ఫేక్ ప్రచారాన్ని కూడా సొంతంగా చేసుకోలేని దుస్థితి వారిది. అందుకే ఫేక్ యూట్యూబ్ ఛానెల్స్‌ను అడ్డుపెట్టుకోని దొంగనాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు ఫేక్‌గాళ్లు. కానీ జనాలకు అన్ని తెలుసు.. ఇలా పక్కవాళ్ల మీద బురదజల్లే కార్యక్రమం మానుకోని వారి పని వారు చేసుకోని.. చేసిన తప్పులను రిపీట్ చేయకుండా చూసుకుంటే బెటర్. ఇలాంటి చెంచా మైండ్‌సెట్‌తో చెంచా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలతో మనసుల్లో చెంచాలుగా మిగిలిపోవడం ఏ మాత్రం మంచిది కాదు కదా!
Also Read: టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే?