Fake Bomb Threat: ఢిల్లీ- విశాఖ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు!

విమానాశ్రయానికి కరెక్ట్‌ టైమ్‌ కి చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు ఎలాగైనా కాసేపు విమానాన్ని ఆపాలనుకున్నాడు. దీంతో విమానంలో బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన మంగళవారం జరిగింది.

New Update
ఫ్లైట్‌ జర్నీ చేసేవారికి గుడ్‌ న్యూస్‌..శంషాబాద్‌ నుంచి మరో 4 విమానాలు!

Bomb Threat: విమానాశ్రయానికి సరైన సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు విమానాన్ని కాసేపు ఆపడం కోసం ఏకంగా విమానంలో బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన మంగళవారం కలకలం రేపింది. విమానాశ్రయ వర్గాల కథనం ప్రకారం...ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఎయిరిండియా విమానం మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరింది.

అందులో ఎక్కాల్సిన ఓ ప్రయాణికుడు సమయానికి చేరుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా విమానం ఎక్కాలన్న ఉద్దేశంతో ఆ ఫ్లైట్‌ లో బాంబు ఉందంటూ కాల్‌ చేసి బెదిరించాడు. అయితే అప్పటికే బయల్దేరిన విమానం విశాఖకు రాత్రి 8.15 కి చేరుకుంది.

ఢిల్లీ ఏఐ సెక్యూరిటీ అప్రమత్తం చేయడంతో సీఐఎస్‌ఎఫ్‌, బాంబు స్వ్కాడ్‌ లు తనిఖీలు చేసి ఏమి లేదని నిర్థారణకు వచ్చాయి. అనుమానాస్పద బాంబు బెదిరింపులకు పాల్పడి, తప్పుడు సందేశం ఇచ్చిన ప్రయాణికుడ్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Also Read: అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు హైదరాబాద్‌ వాసులు మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు