Fake birth certificate: నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన క్రికెటర్లు..కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ మధ్యకాలంలో నకిలీ వస్తువులు తయారీ ఎక్కువైపోయాయి. ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియటం లేదు. టెక్నాలజీ వచ్చాక ప్రతిదాన్ని నకిలీ చేస్తూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారు. తాజాగా మరో నకిలీ ముఠా చేస్తున్న దందా గుట్టురట్టు అయింది.

New Update
Fake birth certificate: నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన క్రికెటర్లు..కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపింది. పలువురు క్రికెటర్లు నకిలీ సర్టిఫికెట్లతో అండర్ 19, అండర్ 23 మ్యాచ్‌లు ఆడినట్లు గుర్తించారు. ఇదే విషయమై గత నెల (సెప్టెంబర్ 30)న హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు హెచ్‌సీఏ లేఖ రాసింది. ప్లేయర్స్ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లను పోలీసులకు హెచ్‌సీఏ అధికారులు అందించారు. దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు అవి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు అని నిర్ధారించారు.

ముగ్గురు ఆటగాళ్లపై కేసు నమోదు

వయస్సును తప్పుగా చూపించి అండర్ 19, అండర్ 23 మ్యాచ్‌లు ఆడినట్లు వారు గుర్తించారు. దీంతో ఉప్పల్ పీఎస్‌లో హెచ్‌సీఏ సీఈవో సునీల్ ఫిర్యాదు చేయడంతో ముగ్గురు ఆటగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసిన AMHO లపైనా కేసు నమోదు చేశారు. ప్లెయర్స్‌గా గుర్తింపు పొందడానికి ముగ్గురు యువకులు ఆడిన ఆట వెలుగులోకి రావటంతో పలువురు నకిలీ సర్టిఫికెట్ల జారీ చేసిన AMHOపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: విశాఖ ఆర్కే బీచ్‌లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు
రెండు రోజుల క్రితం యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. నకిలీ జనన ధ్రువపత్రం కేసులో ఆయనతో పాటు భార్య తజీన్‌ ఫాతిమా, కొడుకు అబ్దుల్లా ఆజమ్‌ను కూడా దోషిగా కోర్టు నిర్ధారించింది. అంతేకాదు వారికీ ఏడేళ్ల పాటు శిక్ష విధించింది. జనవరి 1, 1993న అబ్దుల్లా ఆజం పుట్టిన తేదీ పేర్కొంటూ రాంపూర్‌ మునిసిపాలిటీ ధ్రువపత్రం ఇచ్చింది. మరో సర్టిఫికెట్‌లో ఆయన సెప్టెంబరు 30, 1990లో లఖ్‌నవూలో పుట్టినట్లుగా బర్త్ సర్టిఫికెట్ల ఉంది. కాగా.. ఇలా తప్పుడు జనన ధ్రువపత్రాలు తీసుకోవడంలో అబ్దుల్లాకు ఆయన తల్లిదండ్రులు తజీన్‌ ఫాతిమా, ఆజంఖాన్‌లు సహకరించారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాంపూర్‌లోని గంజ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన ప్రజాప్రతినిధుల కోర్టు మేజిస్ట్రేట్‌ శోభిత్‌ బన్సల్‌ ఆక్టోబర్‌-18న (బుధవారం) ఆజంఖాన్‌, ఫాతిమా, అబ్దుల్లాను దోషులుగా నిర్ధారించి, ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: మంథనిలో బీఆర్ఎస్‌కు షాక్… చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా

Advertisment
Advertisment
తాజా కథనాలు