Coolie : రజినీకాంత్ 'కూలీ' లో మలయాళ స్టార్ హీరో! రజినీకాంత్ 'కూలీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఈ మూవీలో మలయాళ హీరో ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన రజినీకాంత్‌తో ‘వేట్టయ్యన్’ లో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో ’కూలీ’లో మళ్లీ రిపీట్ అవ్వనుంది. By Anil Kumar 12 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Fahadh Faasil In Rajinikanth's Coolie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ'. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో తోనే చెప్పేశారు మేకర్స్. రజినీకాంత్ కెరీర్లో 171 వ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'కూలీ’ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ ని బట్టి లోకేష్ కనగరాజ్ ఈసారి రజినీకాంత్ ని వెండితెరపై సరికొత్తగా చూపించబోతున్నట్టు అర్థం అవుతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడట. Also Read : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో ‘మీర్జాపూర్ సీజన్ 3’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? కీలక పాత్రలో ఫహాద్ ఫాజిల్ రజినీకాంత్ 'కూలీ' మూవీలో మలయాళ స్టార్ హీరోఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఫహద్ ఫాసిల్ ఇప్పటికే రజినీ కాంత్‌తో ‘వేట్టయ్యన్’ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో ’కూలీ’లో మళ్లీ రిపీట్ అవ్వనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'విక్రమ్' సినిమాలోనూ అండర్‌కవర్ ఏజెంట్‌గా నటించాడు ఫహద్ ఫాసిల్. ఇక ఈసారి కూలీ మూవీలో కూడా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మూవీ టీమ్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. #rajinikanth-coolie-movie #fahadh-faasil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి