/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T191022.340.jpg)
Fahadh Faasil First Look : టాలీవుడ్ (Tollywood) లో 'పుష్ప ది రైజ్' మూవీతో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచిన అల్లు అర్జున్ (Allu Arjun) - ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil) కాంబో 'పుష్ప 2' తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. పార్ట్ - 1 క్లైమాక్స్ లో కనిపించిన కొద్ది నిమిషాలు తన విలనిజంతో ఆకట్టుకున్న ఈ మలయాళ యాక్టర్ ఇప్పుడు పార్ట్ - 2 లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు.
ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 8) ఫహాద్ ఫాజిల్ పుట్టిన రోజు కావడంతో 'పుష్ప 2' మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.." బన్వర్ సింగ్ షేకావత్.. ఐపీఎస్.. బిగ్‌స్క్రీన్‌పై మరోసారి అభిమానులను అలరించనున్నారంటూ" పుష్ప టీమ్ ట్వీట్ చేసింది.
Also Read : కేరళ బాధితులకు అండగా చిరు.. సీఎం స్వయంగా చెక్ అందజేత!
Team #Pushpa2TheRule wishes the stellar actor #FahadhFaasil a very Happy Birthday ❤🔥
Bhanwar Singh Shekhawat IPS will be back with a bang on the big screens 💥💥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP… pic.twitter.com/L5iBu5WwUj
— Pushpa (@PushpaMovie) August 8, 2024
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో గన్, గొడ్డలి చేతులతో పట్టుకుని క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.