Fahadh Faasil : 'పుష్ప 2' కోసం రోజువారీగా రెమ్యునరేషన్.. నిర్మాతలకు ఫహాద్ ఫాజిల్ వింత కండీషన్?

ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ విషయంలో పుష్ప నిర్మాతలకు కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం.. రోజుకి రూ.12 లక్షల‍్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేశారట. ఒకవేళ షూటింగ్ రద్దయితే మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాలట.

New Update
Fahadh Faasil : 'పుష్ప 2' కోసం రోజువారీగా రెమ్యునరేషన్.. నిర్మాతలకు ఫహాద్ ఫాజిల్ వింత కండీషన్?

Fahadh Faasil Conditions For 'Pushpa 2' Producers : అప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న మలయాళ అగ్ర హీరో ఫాహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసాడు. 'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం వరుసగా మలయాళ సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఫహాద్ ఫాజిల్ తాజాగా రెమ్యునరేషన్ విషయంలో పుష్ప నిర్మాతలకు కొన్ని కండీషన్స్ పెట్టినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. దాని ప్రకారం..ఫహాద్ ఫాజిల్ 'పుష్ప 2'లో నటిస్తున్నందుకు గానూ రెమ్యునరేషన్ రోజువారీగా తీసుకుంటున్నారు.

Also Read : సినిమా ప్లాప్ అయితే పార్టీ చేసుకుంటా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

వ్వాటే కండీషన్...

దీనికి కొన్ని వింత కండీషన్స్ కూడా పెట్టాడు.రోజుకి రూ.12 లక్షల‍్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేసిన ఫహాద్.. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే మాత్రం అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందట. ఈ కండీషన్స్ గురించి తెలిసిన నెటిజన్స్ ఫహాద్ ప్లానింగ్ మాములుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు