Subhas Chandra Bose: హిట్లర్, బోస్ మధ్య ఉన్న సంబంధం ఏంటి..? వాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు..?

హిట్లర్‌.. తన నాజీ సైన్యంతో యూదులను అత్యంత దారుణంగా చంపాడతను. ఇలా నరనరాన జాత్యహంకారం జీర్ణించుకుపోయిన హిట్లర్‌ను.. సుభాష్‌ చంద్రబోస్‌ ఎందుకు కలిశారన్న దాన్ని పై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు బోస్‌ హిట్లర్‌ను ఎందుకు కలిశారో ఇప్పుడు తెలుసుకుందాము.

New Update
Subhas Chandra Bose: హిట్లర్, బోస్ మధ్య ఉన్న సంబంధం ఏంటి..? వాళ్ళు  కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు..?

Subhas Chandra Bose: శత్రువుకి శత్రువు మిత్రుడు.. ఇది చాలామంది ఫాలో అయ్యే ఫార్ములా. ఇదే సూత్రాన్ని నమ్మారు నేతాజీ. నాడు భారతీయులకు బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి కావాలి. అటు జర్మనీ నియంత హిట్లర్‌కు బ్రిటన్‌ బద్ద శత్రువు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ ఓవైపు బ్రిటన్‌ మరోవైపు హోరాహోరీగా తలపడ్డాయి. ఇటు ఇండియాలో శాంతియుతంగా తెల్లపాలకులపై పోరు జరుగుతుండగా.. బోస్‌ మాత్రం శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదని గాంధీని వ్యతిరేకించారు. గన్‌ తీసి కణతలకు గురిపెడితేనే స్వాతంత్రం వస్తుందని విశ్వసించారు. అందుకే హిట్లర్‌తో చేతులు కలిపేందుకు జర్మనీ వెళ్లారు.

నేతాజీ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే హిట్లర్‌ను కలిశారు. ఈ మీటింగ్‌ 1942 మే 29న జరిగింది. ఇచ్చిపుచ్చుకోవడం అనే డీల్‌లో భాగంగా పరస్పర సాయం కోసం నేతాజీ హిట్లర్‌తో భేటీ అయ్యారు. హిట్లర్‌ను కలవడానికి నేరుగా అతని ఆఫీస్‌కు వెళ్లారు బోస్. నేతాజీ చాలా సేపు ఆఫీస్‌ బయటే చైర్‌లో కూర్చొని ఉన్నాడు. హిట్లర్‌ చూసినా చూడనట్టు వెళ్లిపోయారు. ఇటు నేతాజీ సైతం చూసిచూడనట్టు వ్యవహారించారు. ఇలా చాలాసార్లు జరిగిన తర్వాత హిట్లర్‌ వెనక్కి తగ్గాడు. నేతాజీ వద్దకు వచ్చి ఆయన భుజంపై చెయ్యి వేసి పలకరించాడు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నారు. బోస్‌ను బ్రిటన్‌కు దొరకకుండా జపాన్‌ పంపించాడనికి స్వయంగా హిట్లర్‌ ప్లాన్‌ చేసినట్టుగా చరిత్రకారులు చెబుతుంటారు.

నేతాజీని వీలైనంత త్వరగా జపాన్‌ పంపాలి. నేతాజీ విమానంలో ప్రయాణించకూడదని హిట్లర్‌ భావించారు. ఎందుకంటే అది రెండో ప్రపంచ యుద్ధం సమయం. మిత్ర దేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దళాలు వైమానిక దాడులు చేసే అవకాశం ఉంటుంది. జలాంతర్గామి ద్వారా నేతాజీ జపాన్‌కు వెళ్లాలని హిట్లర్ సలహా ఇచ్చాడు. అందుకు వెంటనే ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 9, 1943లో నేతాజీ U-180 జలాంతర్గామిలో జర్మనీలోని కీల్ నౌకాశ్రయం నుంచి బయలుదేరారు. మే 13, 1943న సుమత్రా ఉత్తర తీరంలోని సబాంగ్‌కు నేతాజీ సురక్షితంగా చేరుకున్నారు. చెక్-అమెరికన్ చరిత్రకారుడు మిలన్ హౌనర్ తన పుస్తకంలో ఈ విషయాలను రాసుకొచ్చారు! అయితే నేరుగా హిట్లర్‌ కానీ అతని నాజీ సైన్యం కానీ ఇండియాకు సాయం చేయలేదు.

అడాల్ఫ్ హిట్లర్ 1889లో ఏప్రిల్ 20న ఆస్ట్రియాలో జన్మించారు. 1933 నుంచి జర్మనీ ఛాన్స్‌లర్‌గా 1934 నుంచి 1945లో మరణించే వరకు జర్మనీ ఫ్యూరర్‌గా వ్యవహరించాడు. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ ఫౌండర్‌.. దీన్నే నాజీ పార్టీ అని పిలుస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన సైన్యం ఓటమి కన్ఫామ్‌ అయిందని నిర్థారించికున్న హిట్లర్ ఆ ముందురోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్‌తో కలిసి ఏప్రిల్ 30, 1945 ఆత్మహత్య చేసుకొన్నాడు.

Also Read: Fenugreek Water: రోజు ఉదయం మెంతి నీటిని తాగితే.. ఆ సమస్యలు పోయినట్లే..!

Advertisment
తాజా కథనాలు