Eye Pain Causes : శరీరానికి చెందిన అత్యంత సున్నితమైన, ముఖ్యమైన భాగాలలో కళ్ళు ప్రధాన. కళ్ళకు(Eyes) సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎందుకంటే కాలక్రమేణా అనేక రకాల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కళ్లకు సంబంధించి కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కండరాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. దీని కారణంగా మీరు అంధత్వానికి గురయ్యే ఛాన్స్‌లు కూడా ఎక్కువే. కాబట్టి ఈ సున్నితమైన అవయవం పట్ల ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని కంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్ లేదా గాయం కారణంగా మీకు నొప్పి పుట్టవచ్చు. కంటి నొప్పి సాధారణంగా ఎరుపు, దురద, కళ్ళు వాపు లాంటి అనేక ఇతర లక్షణాలతో కూడి ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, తప్పకుండా డాక్టర్ల సలహా తీసుకోండి.
కంటి నొప్పి ఎందుకు వస్తుంది?
కంటి నొప్పి(Eye Pain) ఉన్నవారు సకాలంలో చికిత్స పొందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల వ్యాధుల వల్ల కంటి నొప్పి వస్తుంది. కండ్లకలక ఆ జాబితాలో ముందువరుసలో ఉంటుంది. గాయం కారణంగా కళ్ళ ఉపరితలం కూడా దెబ్బతింటుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్(Infection) లేదా కాలుష్యం కూడా కళ్లకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. ఈ సమస్యలు సర్వసాధారణమే అయినప్పటికీ వైద్య సలహా ప్రకారం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చికిత్స చేయకపోయినా తీవ్రమైన కంటి వ్యాధి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
కంప్యూటర్‌పై వర్క్ వల్ల నొప్పి పుడుతుందా?
సాధారణంగా రోజంతా కష్టపడి పనిచేయడం, కంప్యూటర్ వర్క్(Computer Work) పై ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల కళ్ళు అలసిపోతాయి. అందుకే ఈ తరహా జాబ్స్ చేసేవారిలో తరచుగా కళ్ళలో నొప్పి పుడుతుంది. ఇక సూర్యకాంతి(Sun Rays) లేదా చీకటిలో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా కళ్ళలో వాపు కలగవచ్చు. దీని వల్ల నొప్పి పెరుగుతుంది. దుమ్ము, పొడి లేదా అలెర్జీ కారకాలు కూడా కళ్ళలో వాపును కలిగిస్తాయి. ఇది నొప్పితో పాటు అనేక రకాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా కాలంగా కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించడం వల్ల చాలా మందిలో కంటి నొప్పి సమస్య పెరుగుతూ వస్తోంది. కంటి సంబంధిత సమస్యలకు స్క్రీన్ సమయాన్ని పెంచడం ప్రధాన కారణం.
Also Read :