Eye Urine Drops: కంట్లో మూత్రం చుక్కలు.. ఈ అమ్మాయి ప్రతీరాత్రి ఇలా ఎందుకు చేస్తుందో తెలిస్తే షాకే మానవ మూత్రంతో కంటి జబ్బులు నయం అవుతాయని చెబుతోంది స్పెయిన్ కు చెందిన సుమా ఫ్రేల్. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తన కళ్లలో కొన్ని మూత్రం చుక్కలు వేసుకోవడంవల్ల మయోపియా, ఆస్టిగ్మాటిజం వంటి సమస్యలు దూరమైనట్లు చెప్పింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి. By srinivas 24 Feb 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Suma Frale : కంటి సమస్యలకు నివారణగా మానవ మూత్రం అద్భుతంగా పనిచేస్తుందని స్పెయిన్ కు చెందిన టిక్‌టాక్ యూజర్, అసిస్టెంట్ మెటాఫిజికల్ కౌన్సెలర్ అయిన సుమా ఫ్రేల్ (Suma Frale) చెబుతోంది. కంటి సమస్యలకు చికిత్స చేయడానికి మూత్రాన్ని డ్రాప్స్ గా ఉపయోగించాలంటూ ఆమె బలంగా వాదించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇది మయోపియా, ఆస్టిగ్మాటిజం సమస్యలను నయం చేస్తుందని, మెరుగైన కంటి చూపు చికిత్స చేయడానికి సాంప్రదాయ మందుల కంటే మూత్రం చాలా గొప్పదని ప్రచారం చేస్తోంది. pic.twitter.com/XyeoHYQFTO — video_profugos (@x_videoprofugos) February 13, 2024 మయోపియా, ఆస్టిగ్మాటిజం.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేసిన ఆమె.. తన కళ్లలో మూత్రం చుక్కలు వేయడం ద్వారా మయోపియా, ఆస్టిగ్మాటిజం వంటి సమస్యలు దూరమైనట్లు తెలిపింది. అలాగే ఈ యూరిన్ థెరపీ లేదా యూరోథెరపీ అనేది 20వ శతాబ్దంలో బ్రిటీష్ ప్రకృతి వైద్యుడు జాన్ డబ్ల్యూ.ఆర్మ్‌స్ట్రాంగ్‌చే ప్రాచుర్యం పొందిన ప్రత్యామ్నాయ ఔషధంగా ఆమె పేర్కొంది. ఈ విచిత్రమైన చికిత్సా విధానంలో ఔషధ లేదా సౌందర్యం కోసం మానవ మూత్రం వాడకాన్ని ప్రోత్సహిస్తారట. అంతేకాదు చర్మం లేదా చిగుళ్లను మూత్రంతో మసాజ్ చేయడం, దానిని తాగడం కూడా ఉంటుందని ఆమె వివరించారు. ఇక మయోపియా, ఆస్టిగ్మాటిజం అనేవి ఈ రెండూ కంటికి సంబంధించిన సమస్యలే. దగ్గరి చూపును వైద్య పరిభాషలో మయోపియా అంటారు. ఈ వ్యాధి బారిన పడినవారు దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఇది కూడా చదవండి: Telangana:మందు బాబులకు బిగ్ షాక్.. ఎండాకాలంలో బీర్ల కొరత! ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం.. అలాగే రసాయనాలతో కూడిన మందుల కంటే మానవ మూత్రం కంటి సమస్యలను నయం చేయడలతో అద్భుతంగా పనిచేస్తుందని ఆమె అంటోంది. ఆస్టిగ్మాటిజం, మయోపియా నయమయ్యే వరకు ప్రతిరోజూ తన కళ్లలో మూత్రం చుక్కలు వేసుకున్నట్లు చెప్పింది. 'ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నా కళ్లలో కొన్ని మూత్రం చుక్కలు వేసుకున్నా. ఇది ఆస్టిగ్మాటిజం, మయోపియా వంటి వ్యాధులను నయం చేసింది. ప్రజలు ఈ చికిత్స విధానాన్ని అనుసరించవచ్చు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. పలువురు వైద్య నిపుణులు, నెటిజన్లు ఆమె చెప్పినదాన్ని కొట్టిపారేస్తున్నారు. మానవ మూత్రంలో కంటి జబ్బులు నయం అవుతాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. మరికొందరు మాత్రం దీనిపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. #spanish-tiktok-user #suma-frale #putting-urine-as-remedy-for-eye మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి