Eye Cancer: కంటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? కంటి క్యాన్సర్ అనేది అరుదుగా కనిపించే వ్యాధి. చిన్న చిన్న లక్షణాలు మాత్రమే అని నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. కంటి క్యాన్సర్ అసాధారణ పుట్టుమచ్చలు, యువియా, కొన్ని కంటి వర్ణద్రవ్యాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. By Vijaya Nimma 21 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Eye Cancer: భారతదేశంలో కంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మందికి కంటి క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేక లక్షణాలను లైట్ తీసుకుంటున్నారు. కొన్ని కణాలు కళ్లలో లేదా చుట్టూ ఒక కణితిని ఏర్పరుస్తాయి. ఇది ప్రమాదం కాకపోయినా కొన్ని సార్లు ఈ కణితులు ప్రాణాంతకం అవుతాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తాయి. భారతదేశంలో కంటి క్యాన్సర్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధిని అదుపులో ఉంచాలంటే ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. చాలా మంది రోగులు కంటి క్యాన్సర్ లక్షణాలను విస్మరిస్తారు ఎందుకంటే వారికి దాని గురించి తెలియదు. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడే వైద్యుల వద్దకు వెళ్తారు. కంటి క్యాన్సర్ లక్షణాలు: అస్పష్టమైన దృష్టి, పాక్షికంగా లేదా పూర్తిగా దృష్టిని కోల్పోవడం, కాంతిని చూడలేకపోవడం, కంటి లోపల నల్లటి పాచ్, ఒక కన్ను ఉబ్బడం, కనురెప్పల మీద గడ్డలు, కళ్లలో లేదా చుట్టూ నొప్పి. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రజలు వెంటనే వైద్యులను సంప్రదించాలి. కంటి క్యాన్సర్ కారణాలు: సెల్యులార్ DNA, అసాధారణ పుట్టుమచ్చలు, యువియా లేదా ఐరిస్‌లోని అసాధారణ గోధుమ రంగు మచ్చలు, కొన్ని కంటి వర్ణద్రవ్యాలు కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయని వైద్యులు అంటున్నారు. కంటి క్యాన్సర్ చికిత్స: రేడియేషన్ థెరపీ, లేజర్ థెరపీ, కీమోథెరపీ అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స కణితి రకం, పరిమాణం, పరిధిపై ఆధారపడి ఉంటుంది. రేడియేషన్ థెరపీ క్యాన్సర్ కణాలను చంపడానికి వాడుతారు. కానీ లేజర్ థెరపీ కణితిని వేడి చేయడానికి వినియోగిస్తారు. క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే కీమోథెరపీ అవసరం పడుతుందని వైద్యులు అంటున్నారు. ఇది కూడా చదవండి: దేవతా పనస వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> ఇది కూడా చదవండి: టెట్రా ప్యాక్ vs ప్యాకెట్ మిల్క్..ఆరోగ్యానికి ఏది మంచిది? #eye-care-tips #eye-care మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి