Cold Holidays : దేశంలో పెరిగిన చలి(Cold) తీవ్రత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7గంటలు దాటినా పొగమంచు కప్పేయడంతో బయటకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు చలికి వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు, వైద్యులు(Doctors) పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఢీల్లీలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో గవర్నమెంట్ అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
5 రోజులు సెలవులు..
ఈ మేరకు చలిగాలు వీస్తున్న నేపథ్యంలో ఢిల్లీ(Delhi) లోని పాఠశాలలకు(Schools) 5 రోజుల పాటు సెలవులు ప్రటకించింది. అయితే ఇవి 5వ తరగతిలోపు చదువుతున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు రాబోయే ఐదు రోజులు మూసివేయబడతాయి. ఢిల్లీ, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, వాయువ్య రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లలో సూర్యరశ్మి లభించట్లేదు. తీవ్రమైన చలిగా ఉంది. భారత వాతావరణ శాఖ(IMD) ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా తక్కువగా నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6-15°C, గరిష్ట ఉష్ణోగ్రతలు 9-16°C వరకు ఉంటున్నాయి. కావున ఉత్తర భారతదేశంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చిన్న పిల్లలకు పాఠశాల సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు కలిసి ఘోరం
ఇక చలి, పొగమంచు వాతావరణంలో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ జరిగాయి. కానీ రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించేలా లేవని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని స్పష్టం చేశారు.