NEET : నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

నీట్ అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మార్చి 9తో ముగియాల్సిన అప్లికేషన్స్ ప్రక్రియను మార్చి 16 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://neet.nta.nic.in/

NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు
New Update

NEET UG 2024 : నీట్(NEET) అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో(Health Education Course) ప్రవేశాల కోసం నిర్వహించే NEET (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల విడుల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అప్లికేషన్ తేదీ మార్చి 9తో ముగిసింది. అయితే ఈ ఏడాది మరింత సంఖ్యపెరిగిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని మార్చి 16 వరకు గడువు పొడిగిస్తున్నట్లు NTA వెల్లడించింది.

రికార్డు స్థాయిలో దరఖాస్తులు..
ఈ మేరకు మే 5న నీట్‌ పరీక్ష(NEET Exam) ను నిర్వహించనుండగా ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ ఎగ్జామ్ జరగనుంది. అలాగే ఈసారి నీట్‌ పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్చి 9నాటికి 25లక్షల మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారని, గతేడాదితో పోలిస్తే ఈఏడాది 4 లక్షలకు మించి దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: TS: ఆంధ్రోళ్ల బూట్లు నాకి సీఎం అయ్యావు.. ఎవరు మగాడో తేల్చుకుందాం దా.. కేటీఆర్ సవాల్!

ఇక గడువు పొడగింపుపై అభ్యర్థుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ నెట్ సమస్యల కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, పెంచిన గడువుతో తమకు ఉపశమనం లభించిందంటున్నారు. నీట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ వెబ్ సైట్ ను సంప్రదించంది. https://neet.nta.nic.in/

#applications #neet-exam #health-education-course
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe