ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు

భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 22 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్‌ వారీగా సికింద్రాబాద్‌ నుంచి రాకపోకలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు
New Update

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ ప్రాంతాలకు సురక్షితంగా చేర్చేందుకు భారతీయ రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. ఉపాధి, తదితర అవసరాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలను తిరిగి తమ గమ్య స్థానాలకు చేర్చడంకోసం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పండగ సీజన్ లో ప్రత్యేక ఆఫర్లు కల్పిస్తున్న రైల్వే అధికారులు.. దైవ దర్శనాలు, రద్దీగా ఉండే సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మళ్లీ పొడిగించబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం రైల్వే జోన్‌ అధికారులు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్‌ వారీగా ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌- దర్‌బంగ్‌, హైదరాబాద్‌-గోరఖ్‌పూర్‌, సికింద్రాబాద్‌-ధనపూర్‌, మధురై-కాచిగూడ, నాగర్‌సోల్‌‌-కాచిగూడ వంటి పలు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు ప్రకటన చేశారు. అలాగే డిసెంబరు1 నుంచి 29 వరకు(శుక్రవారం) తిరుపతి-అకోలా (07605), 3 నుంచి 30 వరకు (ఆదివారం) అకోలా-తిరుపతి (07606), 4 నుంచి 25 వరకు (సోమవారం) పూర్ణ-తిరుపతి(07609), 5నుంచి 26 వరకు (మంగళవారం) తిరుపతి-పూర్ణ (07610), 2 నుంచి 30 వరకు (శనివారం) హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631), 3 నుంచి 31 వరకు (ఆదివారం) నర్సాపూర్‌- హైదరాబాద్‌ (07632), 3 నుంచి 31 వరకు (ఆదివారం) తిరుపతి-సికింద్రాబాద్‌ (7481), 4 నుంచి 25 వరకు(సోమవారం) సికింద్రాబాద్‌-తిరుపతి (07482), డిసెంబరు 1 నుంచి 29 వరకు (సోమ, బుధ, శుక్రవారాలు) కాకినాడ టౌన్‌-లింగంపల్లి (07445), 2 నుంచి 30 వరకు (మంగళ, గురు, శనివారాలు) లింగంపల్లి-కాకినాడ టౌన్‌ (07446) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలియజేశారు.

Also read :ఆ ఒక్క సీన్ కోసం వాళ్లతో రెండు రాత్రులు గడిపాను.. రాధిక ఆప్టే

ఇదిలావుంటే.. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాలలో దక్షిణ మధ్య రైల్వే రెండు పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ షీల్డ్‌-2023 పొందింది. ఈ షీల్డ్‌ అవార్డును ఈ నెల 15న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతుల మీదుగా ఎస్‌సీఆర్‌ జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అందుకోనున్నారు.

#south-central-railway #extension #22-special-trains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe