CID filed memo: చంద్రబాబు రిమాండ్ పొడిగించండి.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు రెండోసారి విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో ఆయనను హాజరుపరిచారు. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని ఏసీపీ కోర్టులో ఎక్స్టెన్షన్ మెమో దాఖలు చేసింది సీఐడీ. చంద్రబాబును మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని మెమోలో సీఐడీ పేర్కొంది. By Vijaya Nimma 05 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్నారు. నిన్ననే ఆయన వాదనలు వినిపించగా.. సమయం లేకపోవడంతో పూర్తిస్థాయిలో వినలేదు. అందుకని ఇవాళ్టికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో మళ్లీ గురువాయం వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న వాదనలు వినిపిస్తూ టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు విషయంలో సాంకేతిక కమిటీ, టెండర్ అవార్డు కమిటీలో చంద్రబాబు సభ్యుడిగా లేరన్నారు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ తెలిపారు. విధానపరమైన నిర్ణయాల అమలు విషయంలో.. తప్పులకు, ఆర్థిక అక్రమాలకు, చోటు చేసుకున్న లోపాలకు అప్పటి ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయడం సరికాదని అగర్వాల్ అన్నారు. అయితే ఈ కేసులో రాజకీయంగా బలమైన ప్రత్యర్థిగా ఉన్న పిటిషనర్‌ను కారాగారంలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో దురుద్దేశంతో చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించారని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదించారు. బెయిల్ లభిస్తుందా..? లేదా..? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ ప్రారంభమైంది. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు, బెయిల్ మంజూర్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు నిన్న (బుధవారం) హోరాహోరీగా వాదనలు వినిపించారు. అయితే కోర్టులో నేడు విచారణ ముగిసి.. కీలక తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభిస్తుందా..? లేదా..? అనే ఆసక్తి నెలకొంది. కాగా.. బుధవారం (నిన్న) కోర్టులో కీలక వాదనలు జరిగాయి. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబుపై నేరారోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను చూపించండి. నిధుల విడుదలతో చంద్రబాబుకు సంబంధం ఉందా..? అప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఎవరు..? అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం జరిగిన దర్యాప్తునకు, ప్రస్తుతం జరిగిన దర్యాప్తునకు పెద్దగా తేడా లేదన్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదు..? అని ప్రశ్నించారు. మరి నేడు వాదనలు ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి. న్యాయం ముందు అందరూ సమానమే అయితే ఏసీబీ కోర్టులో రెండవ రోజు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు ఇనిపించారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయి అన్నారు. చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారని ఆయన తెలిపారు. రూ.27 కోట్లు నేరుగా టీడీపీ ఖాతాలో జమ అయ్యాయి అన్నారు. ఆర్టికల్ 14ని పొన్నవోలు ప్రస్తావించారు. న్యాయం ముందు అందరూ సమానమే....ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే అని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఇది ఆర్డనరీ కేసు కాదు...తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు అన్నారు. చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇలా చేస్తే ఎంతటి గురక అయినా తగ్గాల్సిందే.. గురక మీకు సమస్యగా మారిందా..? #chandrababu #remand #memo #extend #cid-filed #acp-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి