Ram Setu: రామసేతును రాముడే నిర్మించాడా? సహజంగా ఏర్పడిందా ?

రామసేతు వంతెన నిర్మాణం సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. ఓవైపు హిందువులు దీన్ని రాముడే కట్టాడని వాదిస్తుంటే.. సైంటిస్టులు మాత్రం నేచురల్‌గా నిర్మితమైన వంతెన అని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Ram Setu: రామసేతును రాముడే నిర్మించాడా? సహజంగా ఏర్పడిందా ?
New Update

Ram Setu Unsolved Mystery: రామసేతు.. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ నిర్మాణం గురించి ఇప్పటికీ అనేక వాదనలు.. రాముడే కట్టేడాని హిందూవుల వాదన ఒకవైపు.. లేదు లేదు ఇది నేచురల్‌గా నిర్మితమైన వంతెన అని సైంటిస్టులు చెబుతున్న మాటలు మరోవైపు..! ఇలా ఎవరి వాదనలు వారికి ఉండగా.. ఇంతలో భారతీయ అంతరీక్ష పరిశోధన సంస్థ-ఇస్రో (ISRO) నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చింది. రామసేతుకు సంబంధించిన పలు రహస్యాల ఛేదనలో ఇస్రో మరో మైల్‌స్టోన్‌ను చేరింది. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను ఇస్రో విడుదల చేసింది.

అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 (ICESat-2) డేటాను వినియోగించి రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంటుందని ఇస్రో అంచనా వేస్తోంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉంటుంది. ఈ వంతెన తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. ఈ బ్రిడ్జ్‌ను సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రామ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి ఉందంటున్నారు. రామసేతుపై భిన్నమైన కథలు వినిపిస్తుంటాయి. హిందూ పురాణాల ప్రకారం తమిళనాడు నుంచి శ్రీలంకకు వెళ్లడానికి రాముడు ఈ బ్రిడ్జ్‌ కట్టాడన్ని భక్తులు నమ్ముతుంటారు. రాముడి భార్య సీతను రావణుడు శ్రీలంకకు అపహరించుకుపోయినట్టు హిందూ గ్రంధాలు చెబుతుంటాయి. శ్రీలంకకు రావణుడు రాజు అని రామాయణ కథల్లో ఉంటుంది. ఈ ఇతిహాసమంతా రాముడు, సీత, రావణుడు చుట్టూనే తిరుగుతుంటుంది. సీతను రక్షించుకోవడం కోసం, రావణుడిని ఓడించడం కోసం రాముడు తన సైన్యంతో ఈ వంతెనను నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే హిందూవులు ఈ బ్రిడ్జ్‌ని రాముడే నిర్మించాడని నమ్ముతారు.

Also Read: తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు

మరోవైపు సైంటిస్టుల వాదన మరోలా ఉంటుంది. సున్నపురాయితో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ కాలక్రమేణా సహజంగా నిర్మించబడిందని చెబుతుంటారు. భారత ఉపఖండాన్ని శ్రీలంకతో కలుపుతూ ఉన్న ఈ వంతెన వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టానికి పైన ఉండి ఉండవచ్చని భూగర్భ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అటు 17వ శతాబ్దంలో, బ్రిటీష్ ఎక్స్‌ప్లోరర్‌ ఆడమ్ ఈ ప్రాంతాన్ని సర్వే చేశాడు. అందుకే ఈ వంతెనను పలుచోట్ల అడమ్స్‌ బ్రిడ్జ్‌ అని కూడా పిలుస్తారు. రామసేతు మూలాలు, నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి అనేక భౌగోళిక అధ్యయనాలు జరిగాయి. వంతెన నిర్మాణాన్ని విశ్లేషించడానికి పరిశోధకులు రిమోట్ సెన్సింగ్, సీస్మిక్ ప్రొఫైలింగ్, సీఫ్లూర్ మ్యాపింగ్ లాంటి పద్ధతులను ఉపయోగించారు. మరోవైపు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలోని టెక్టోనిక్ ప్లేట్ కదలికలు రామసేతు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయని నమ్ముతుంటారు. ఇక ఈ ప్రాంతంలోని పగడపు నమూనాలను కార్బన్ డేటింగ్ చేయగా ఈ వంతెన సుమారు 7,000-18,000 సంవత్సరాల పురాతనమైనదిగా తేలింది.

అటు రామసేతు రాజకీయంగానూ వివాదాస్పద అంశమే. 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం ఈ సేతు దగ్గరలో ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కారు ప్లాన్. ఈ ప్రాజెక్ట్ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రయాణించడానికి ఓ మార్గాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ రూట్ ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తుండటంతో దీనిపై హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. అటు భారత్, శ్రీలంకకు చెందిన పర్యావరణ వేత్తలు కూడా సముద్ర పర్యావరణం దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. మొత్తంగా చూస్తే అటు సైన్స్‌కు, ఇటు భక్తుల నమ్మకాలకు మధ్య జరిగే నిరంతర ఘర్షణలో రామ సేతు నలిగిపోతూ ఉంది.

Also read: రేపు తెరుచుకోనున్న రత్న భాండాగారంలో మరో రహస్య గది

#telugu-news #isro #lord-rama #ramayan #ram-setu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe