Health Tips: ఎక్సర్‌సైజ్‌ చేయడానికి కరెక్ట్ టైం ఇదే.. బరువు ఇట్టే తగ్గుతారు!

నేటికాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితేఉదయం 7 నుంచి 9గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారాని తాజాగా ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

New Update
Health Tips: ఎక్సర్‌సైజ్‌ చేయడానికి కరెక్ట్ టైం ఇదే.. బరువు ఇట్టే తగ్గుతారు!

బరువు తగ్గేందుకు చాలా కష్టపడుతున్నారా? బరువు తగ్గేందుకు ఏ సమయంలో వ్యాయామం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే మీకు సరైన సమాధానం చెప్పింది ఓ అధ్యయనం. బరువు తగ్గేందుకు మంచి సమయం ఏదో చెప్పింది. ఒబేసిటి అనే జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఉదయం 7గంటల నుంచి 8గంటల మధ్య వ్యాయామం చేస్తే ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారని తేల్చింది. ఈ అధ్యయనంలో 2003-2006 మధ్యకాలంలో నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే లో పాల్గొన్న 5285మందిని అధ్యయనం కోసం క్రాస్ ఎనలైజ్ చేయడానికి వారిని మూడు సముహాలుగా విభజించారు పరిశోధకుకలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మోడరేట్ టు వైగరస్ ఫిజికల్ యాక్టివిటీ స్థాయి, స్థూలకాయంతో కూడిన రోజువారీ నమూనా రిలేషన్ను పరిశీలించారు.

మోడరేట్ టు వైగరస్ ఫిజికల్ యాక్టివిటీ స్థాయి, స్థూలకాయం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించారు. ఉదయం పూట వ్యాయామం చేసేవారిలో ఇతర గ్రూప్ లవారి కంటే తక్కువ శరీర ద్రవ్యరాశి సూచిక ఉన్నట్లు తెలిపింది. నడుము చుట్టుకొలత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. స్వీయ నివేదిత ఆహార రీకాల్ ఇతర సమూహాలతో పోల్చి నట్లయితే ఉదయం క్లస్టర్ లోని వ్యక్తులు ఆరోగ్యకరమైన డైట్ ను ఫాలో అవుతున్నారని శరీర బరువు యూనిట్ కు తక్కువ రోజువారీ శక్తిని తీసుకుంటున్నారని సూచించింది.

10 నెలల తర్వాత, పాల్గొన్న వారందరూ బరువు తగ్గారు కానీ అందులో చాలా తేడా కనిపించింది. పరిశోధకులు దీనికి ఏ కారణాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, ప్రజలు వ్యాయామం చేసే సమయానికి వారు శ్రద్ధ చూపారు. పాల్గొనేవారు ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడైనా వ్యాయామం కోసం రావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఉదయం వర్కౌట్ చేసే వారి కంటే మధ్యాహ్నం పని చేసేవారు తక్కువ బరువు తగ్గినట్లు కనిపించింది.

ఉదయం వ్యాయామం చేసినవారు త్వరగా బరువు తగ్గినట్లు నిపుణులు గుర్తించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మనుపటి అధ్యయనాలు శారీరక శ్రమ తీవ్రత ప్రీక్వెన్సీ, వ్యవధి అనే మూడు అంశాలపై దృష్టి సారించాయి. శారీరక శ్రమ, రోజులో కదిలే సమయాన్ని యాక్సిలెరోమీటర్ ద్వారా కొలిచి నామూనాను చెక్ చేశాయి. రోజు ఉదయం వ్యాయామం ప్రారంభిస్తే బరువు తగ్గేందుకు సహాయపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీకి మళ్ళీ రెయిన్ అలెర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు