Aloevera Plant: కలబందలో విషపూరితమైనవి ఉంటాయా?.. ఇంట్లో పెట్టుకుంటే అంతేనా? కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొన్ని మొక్కల్లో విష పదార్థాలు కూడా ఉంటాయి. వాటిని తినడం లేదా శరీరంపై పూయడం వలన హాని కలుగుతుందని వైద్యులు అంటూరు. ఈ కలబందలో దాదాపు 600 జాతుల్లో కొన్ని అలోవెరా జాతులు విషపూరితమైనవని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Aloevera Plant: ప్రతి ఒక్కరు ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఎన్నో ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉంటాయి. అయితే అన్ని కలబంద జాతులు ఔషధాలు కాదు. కొన్ని మొక్కల్లో విష పదార్థాలు కూడా ఉంటాయి. వాటిని తినడం లేదా శరీరంపై పూయడం వలన హాని కలుగుతుంది. అందుకే కలబందను ఉపయోగించే ముందు దాని గురించి వాస్తవాలు తెలుసుకోవాలి. అలోవెరా అనేక సౌందర్య ఉత్పత్తులలో విస్తృతంగా వాడుతారు. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మార్కెట్‌లో అలోవెరా జ్యూస్ కూడా దొరుకుతుంటుంది. దీన్ని అందరూ ఇంట్లో పెంచుకుంటారు. దీని జెల్‌ను తీసుకొని ముఖానికి, జుట్టుకు రాస్తుంటారు. ఈ కలబందలో దాదాపు 600 జాతులు ఉన్నాయి. కొన్ని అలోవెరా జాతులు విషపూరితమైనవి. అన్ని కలబంద మొక్కలను వైద్యానికి వాడవచ్చా? కలబంద మొక్కలలోని ఔషధ, వైద్య గుణాలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని విషపూరిత మొక్కలను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో ప్రమాదమని శాస్త్రవేత్తలు అంటున్నారు. మంచి కలబంద మొక్కను ఎలా గుర్తించాలి? మందపాటి కోణాల ఆకులు ఉండి చివరన ముడుచుకుంటాయి. ఆకులు ఎక్కువగా నిలువుగా పెరుగుతాయి, బయటి ఆకులు వంగి ఉంటాయి. మొక్క మధ్యలో నుండి కొత్త ఆకులు పెరుగుతాయి కొత్త ఆకులు మందమైన తెల్లని మచ్చలను కలిగి ఉంటాయి, పాత ఆకులకు ఎలాంటి మచ్చలు ఉండవు వీటి రంగు కూడా ఆకుపచ్చగా ఉంటుంది. ఏ కలబంద ఔషధ గుణాలు కలిగి ఉంటుంది? ఇళ్లలో పెంచుకునే కలబందల్లో చాలా వరకు ఔషధాలకు ఉపయోగపడతాయి. బార్బాండెన్సిస్ మిల్లర్ బార్బడోస్ అలో ట్రూ అలోయ్ ఈ జాతుల కలబందలను ఎక్కువగా ఇళ్లలో పెంచడంతో పాటు ఔషధాలుగా ఉపయోగిస్తారు. ఇది కూడా చదవండి: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లి నూనె తయారీ ఎలాగో తెలుసా..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: మొక్కలు కూడా మాట్లాడుతాయా?..కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం #health-benefits #tips #aloevera-plant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి