Silver Price Becomes Rs.1 Lakh : వెండి ధరలు (Silver Price) వారం క్రితం తగ్గుతూ వచ్చాయి. ఒకదశలో కేజీకి 12 వెలదాకా ధర తగ్గిపోయింది. తరువాత పుంజుకోవడం మొదలు పెట్టింది. గత రెండు రోజుల్లోనే దాదాపు మూడువేల రూపాయల వరకూ వెండి ధరలు పెరిగాయి. నిజానికి, లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) ముందు దేశంలో వెండి ధరలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తుందని. వెండి ధర లక్ష దాటుతుందని అనిపించింది. అయితే, అకస్మాత్తుగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ నాలుగు రోజుల్లోనే ధరలు పెరగడం ప్రారంభం అయింది. ఇప్పుడు మరోసారి మార్చి నాటికి వెండి ధర రూ.లక్ష దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు దీని వెనుక ఖచ్చితమైన కారణాలను కూడా చెబుతున్నారు. వాస్తవానికి, ఇటీవల చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్థిక వ్యవస్థ వేగం మందగించింది. ఈ కారణంగా, వెండికి పారిశ్రామిక డిమాండ్ తగ్గింది. దీంతో వెండి ధరలు తగ్గడం ప్రారంభించాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
వెండి ధర రూ.లక్ష దాటనుంది
Silver Price : వెండికి పారిశ్రామిక డిమాండ్ మరోసారి పెరుగుతోందని కేడియా కమోడిటీస్ హెడ్ అజయ్ కేడియా (Ajay Kedia) మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో, ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ అమెరికా వచ్చే నెలలో పాలసీ వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించింది. దీంతో వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చైనా నుండి వెండికి పారిశ్రామిక డిమాండ్ మరోసారి పెరిగితే, మార్చి 2025 నాటికి వెండి ధర కిలో రూ.1.10 లక్షలకు చేరవచ్చు. ఈ విధంగా చూస్తే, స్వల్పకాలంలో బంగారం కంటే వెండిపై రాబడి మెరుగ్గా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు నిపుణులు.
అందుకే వెండికి డిమాండ్ పెరుగుతుంది..
భారత్ (India) లో ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం ప్రారంభమైంది. అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉంది. ఇది కాకుండా, 2024-25 బడ్జెట్‌లో తయారీని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కాలంలో, దేశంలో ఎలక్ట్రానిక్స్ -సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడం వల్ల దేశీయ స్థాయిలో వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది.
ఇది మాత్రమే కాదు, మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్లు, బ్యాటరీలు భారతదేశ బడ్జెట్‌లో చౌకగా అయ్యాయి. దీంతో వాటికి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది అంతిమంగా ప్రపంచ స్థాయిలో వెండికి పారిశ్రామిక డిమాండ్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా రానున్న రోజుల్లో వెండి ధర వేగంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం వెండి ధర ఇదీ..
ఆగస్టు 1న స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.87,100గా ఉంది. కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.84,534కి చేరుకుంది.
Also Read : మినోగైన్ మందులు వాడొద్దు: డీసీఏ డీజీ కమలాసన్ రెడ్డి