Exit Polls 2024 : కేంద్రంలో అధికారం ఈసారి ఆ పార్టీదే.. ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయిగా..

కేంద్రంలో అధికారం ఏ కూటమి వస్తుంది అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. రాష్టాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈ సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉన్నా.. జాతీయస్థాయిలో మాత్రం.. బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోందని చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు

New Update
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ సంచలనం.. అంతా అనుకున్నట్టే.. అక్కడ అలా.. ఇక్కడ ఇలా 

NDA : ఎన్నికలు. ఫలితాలు.. మధ్యలో ఎగ్జిట్ పోల్స్ (Exit Polls).. అందరి హార్ట్ బీట్ ను పెంచేస్తున్న ఎన్నికల ఫలితాలకు (Election Results) సంబంధించి.. కనీసం రెండు రోజులైనా మనశ్శాంతి ఇస్తాయేమొ అంటుకుంటే అవి మరింత గందరగోళంలోకి ప్రజల్ని నెట్టేశాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) సంబంధించి ఎక్కువ పోల్ సర్వేలు రకరకాల ఫిగర్స్ చెప్పినా.. జాతీయ స్థాయిలో మాత్రం అన్ని సర్వేలు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ (BJP) కి అనుకూలంగా ఓటర్లు ఉన్నారని స్పష్టం చేస్తున్నాయి. ఆర్టీవీ సర్వేలో చెప్పిన విషయాలను దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రతిఫలించేలా తమ రిజల్ట్స్ ఇస్తుండడం విశేషం.   ఏ సంస్థ జాతీయ స్థాయిలో ఏ ఫలితాన్ని వివరించిందో తెలుసుకుందాం..

దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ లో..
బీజేపీ కూటమి ఎన్డీఏ.. 281-350 సీట్లు గెలిచే అవకాశం ఉంది..
ఇందులో బీజేపీ 248-298 స్థానాలు.. ఇతర పార్టీలు 33-52 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశారు. ఇతర పార్టీల్లో ఏపీకి సంబంధించి టీడీపీ 10-12 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. జనసేనకు పార్టీకి ఒక సీటు వస్తుందని అంచనా వేసింది.
ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి.. 145-201 స్థానాలు గెలిచే అవకాశం
ఇందులో కాంగ్రెస్ 59-98 అదేవిధంగా ఇతర పార్టీలు 86-103 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నాయి దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్.

రిపబ్లిక్ టీవీ..
ఎన్డీఏ కూటమి 359 సీట్లు గెలిచే అవకాశం
ఇండి కూటమి.. 154 సీట్లు
ఇతరులు.. 30 సీట్లు గెలిచే అవకాశం
మ్యాట్రిజ్..
ఎన్డీఏ కూటమి 353-368
ఇండి కూటమి 118-133
ఇతరులు 43-48 స్థానాలు గెలిచే అవకాశం ఉంది.

జన్ కీ బాత్ 

ఎన్డీఏ కూటమి 362-392
ఇండి కూటమి 141-162
ఇతరులు 10-20 స్థానాలు గెలిచే అవకాశం ఉంది.

ఇండియా న్యూస్

ఎన్డీఏ కూటమి 371
ఇండి కూటమి 125
ఇతరులు 47 స్థానాలు గెలిచే అవకాశం ఉంది.

మ్యాట్రిజ్ 

ఎన్డీఏ కూటమి 353-368
ఇండి కూటమి 110-133
ఇతరులు 43-48స్థానాలు గెలిచే అవకాశం ఉంది.

ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఇవి. ఇందులో ఏకపక్షంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నట్టు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. బీజేపీ నినాదం 400 సీట్లు కాకపోయినా.. మెజార్టీ స్థానాల్లో గెలవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని అర్ధం అవుతోంది.

Also Read : ఏపీలో దారుణం.. డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌!

Advertisment
తాజా కథనాలు