Assistant Loco Pilot: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవగా.. దీని కోసం CBT 1 పరీక్షను 2024 జూలై, ఆగస్టు మధ్య నిర్వహించనుంది. ఈ పరీక్షకు అర్హత సాధించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 2024 ALP సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. పరీక్షా సరళి, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 3 దశలుగా విభజించబడింది. అవి. CBT 1, CBT 2 & CBATలుగా ఉన్నాయి. అయితే ఇది కఠినమైన పరీక్ష అయినందువ్లల ఎలా ప్రిపేర్ కావాలి? ఏ సిలబస్‌ను విశ్లేషణాత్మకంగా చదవాలోకూడా బోర్డ్ విశ్లేషించింది.
పరీక్షా సరళి పార్ట్ A, పార్ట్ B పద్ధతిలో 2 భాగాలను కలిగి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) పోస్ట్‌లకు ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు పరీక్షలో ప్రతి భాగంలో కనీసం 42 మార్కులు సాధించాలి. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) కోసం టాప్ అభ్యర్థుల జాబితా ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారి నుంచి తయారు చేయబడుతుంది. ఈ జాబితా రెండవ దశ CBT పార్ట్ A నుంచి 70% మార్కులను, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 30% మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
గణితం, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ ఉన్నాయి. గణిత శాస్త్ర విభాగంలోని అధ్యాయాలు బాగా సిద్ధం కావాలి. అభ్యర్థులు పరీక్షలలో బాగా స్కోర్ చేయడానికి ఈ అధ్యాయాలపై చాలా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
CBT 1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష 1)
CBT 2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2)
CBAT (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్)
సిలబస్‌ను కవర్ చేయడానికి అధ్యయన ప్రణాళిక:
దేశంలో అత్యంత పోటీ పరీక్షల్లో ఒకటి RRB ALP 2024 పరీక్ష. ప్రతి సంవత్సరం ఈ CBT కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. కానీ మెరిట్ ఆధారంగా తక్కువ సంఖ్యలో మాత్రమే ఎంపిక అవుతున్నారు. ఫలితంగా అభ్యర్థులు ఇటీవలి RRB ALP సిలబస్‌కు కట్టుబడి అత్యంత కీలకమైన అధ్యాయాలు, అంశాలను మాత్రమే అధ్యయనం చేయాలి. ఇది మీకు RRB ALP CBT 2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో సహాయపడే అధ్యయన ప్రణాళిక.
2024కి సంబంధించిన పరీక్షా సరళిని పరిశీలించి, కీలకమైన సబ్జెక్ట్‌లను గుర్తించండి. మీరు సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి పరీక్ష కోసం ముందస్తు అవసరాలపై అవగాహన పొందండి. ప్రతి సబ్జెక్ట్, అధునాతన అధ్యాయాలకు సంబంధించిన అన్ని ప్రాథమిక అంశాల పునాదులను అర్థం చేసుకోవడానికి అడ్డా రైల్వే మహాప్యాక్ నుంచి వనరులను ఎంచుకోండి. అత్యంత జనాదరణ పొందిన మెటీరియల్ సేకరించి.. మీ బలహీతలను గుర్తించండి. పరీక్షలో మంచి స్కోర్ చేయడానికి గత సంవత్సరం ప్రశ్నపత్రాలను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.
ఇక ఈ అసిస్టెంట్ లోక్ పైల్ పోస్టులకు సంబంధించి జనవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.