Andhra Pradesh: టీడీపీలో అసమ్మతి సెగలు.. రెండుగా చీలిపోయిన పార్టీ నేతలు

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుగా రాజకీయాలు మారిపోయాయి. మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించడంతో ముళ్లుపూడి వర్గీయులు నిరసనలు చేస్తున్నారు.

TDP Parliamentary: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
New Update

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలోని టీడీపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి . ఆ పార్టీకి చెందిన నేతలు రెండుగా చీలిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుగా రాజకీయాలు మారిపోయాయి. అయితే గోపాలపురం నుంచి మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లజర్లలో ముళ్లపూడి వర్గీయులు నిరసనలు చేస్తున్నారు.

Also Read: షర్మిలకు మాఫియా ముఠాతో సంబంధాలున్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్!

మద్దతు ఇవ్వం

మద్దిపాటి వెంకటరాజుకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతు పలికేది లేదని ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు అంటున్నారు. గోపాలపూరం టీడీపీ అభ్యర్థిపై హైకమాండ్‌ పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ మద్దిపాటిని మార్చకపోతే.. తాము స్వతంత్ర అభ్యర్థిని నిలబెడతామని తేల్చిచెబుతున్నారు. అయితే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. తాజాగా టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. అలాగే ఉమ్మడి ప్రచార వ్యూహంపై చర్చలు జరిపారు.

పెండింగ్‌లో పలు స్థానాలు 

టీడీపీ 128 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరో 16 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, ఎంపీ స్థానాల అభ్యర్థులను ఈరోజు లేదా రేపు వెల్లడించే ఛాన్స్ ఉంది. ఇక మార్చి 26 నుంచి చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మరోవైపు ఈనెల 27 నుంచి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలోకి దిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎవరకి అధికార బాధ్యతలు అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచిచూడాల్సిందే.

Also Read: ప్రొద్దుటూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు!

#chandrababu #tdp #pawan-kalyan #ap-politics #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe