తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీపోటీగా ఎన్నికలు జరిగిన తర్వాత.. చివరికి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. దీంతో రెండేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ సర్కార్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేస్‌లో ఉన్నారు. వీళ్లతో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిపాక.. చివరికి రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి బాధ్యతను అప్పగించింది.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5వేల జాబ్స్‌కు ఖమ్మంలో మెగా జాబ్ మేళా!
అయితే ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. టీ కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్‌గా పనిచేసిన మానిక్కమ్ ఠాకుర్‌కు 50 కోట్లు ఇచ్చి రేవంత్ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని అన్నారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మానిక్కమ్ ఠాకుర్ సీరియస్ అయ్యారు. కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసులు పంపించారు.
Also Read: కుమారీ ఆంటీకి రేవంత్ గుడ్ న్యూస్.. స్ట్రీట్ ఫుడ్ రీఒపెన్..