Telangana: కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తా.. మానిక్కం ఠాకూర్ టీ కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్‌గా పనిచేసిన మానిక్కమ్ ఠాకుర్‌కు 50 కోట్లు ఇచ్చి రేవంత్ సీఎం పదవి తెచ్చుకున్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మానిక్కమ్ ఠాకుర్ డిమాండ్ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని నోటీసులు పంపించారు. By B Aravind 31 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీపోటీగా ఎన్నికలు జరిగిన తర్వాత.. చివరికి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. దీంతో రెండేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి.. కాంగ్రెస్ సర్కార్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేస్‌లో ఉన్నారు. వీళ్లతో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిపాక.. చివరికి రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి బాధ్యతను అప్పగించింది. Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5వేల జాబ్స్‌కు ఖమ్మంలో మెగా జాబ్ మేళా! అయితే ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. టీ కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్‌గా పనిచేసిన మానిక్కమ్ ఠాకుర్‌కు 50 కోట్లు ఇచ్చి రేవంత్ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని అన్నారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మానిక్కమ్ ఠాకుర్ సీరియస్ అయ్యారు. కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసులు పంపించారు. A defamation notice has been sent to Koduku. Perhaps he's too engrossed in his farm house entertainments to bother with a reply. If he doesn't respond in 7 days, it's off to court we go! https://t.co/BzhytzeZjK pic.twitter.com/xJ9DfelaiU — Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) January 31, 2024 Also Read: కుమారీ ఆంటీకి రేవంత్ గుడ్ న్యూస్.. స్ట్రీట్ ఫుడ్ రీఒపెన్.. #ktr #telugu-news #telangana-news #manikkam-thakur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి