కోల్‌కతాలోని జూనియర్ డాక్టర్ వైద్యురాలి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకంది. తాజాగా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆస్పత్రికి సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి సందీప్ ఘోష్‌ను సీబీఐ ఇప్పటివరకు 15 సార్లు విచారించింది. ఆ తర్వాత ఆయన్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన నిజాం ప్యాలెస్ ఆఫీస్‌కు తరలించారు. అక్కడే ఆయన్ని అధికారులు అరెస్టు చేశారు.
Also read: వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం!
జూనివయర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆర్‌జీ కర్ కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. దీంతో ఆయనపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలోనే సందీప్ ఘోష్ ప్రిన్సిపల్‌గా కొనసాగిన కాలంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని హాస్పిటల్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డా.అఖ్తర్ అలీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సీబీఐ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. సందీప్ ఘోష్ అరెస్టు అయిన తర్వాత టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్‌లో ఎక్స్‌లో స్పందిచారు. మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. తర్వాత ఏంటి ? అని పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. హత్యాచార ఘటన అనతంరం సందీప్ ఘోష్‌ను దాదాపు 140 గంటలు సీబీఐ విచారణ జరిపింది. అలాగే హస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కూడా అధికారులు ఆయన్ని విచారించారు. ఇప్పుడు తాజాగా ఆయనతో పాటు ఇతర సంస్థలపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గత ఆదివారం సీబీఐ అధికారులు సందీప్ ఘోష్‌ను ఆయన ఇంట్లోనే విచారించారు. అలాగే గురువారం కేంద్ర దర్యాప్తు బృందాలు ఆర్‌జీ కర్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ పరిశీలించాయి. నిజాం ప్యాలెస్ ఆఫీస్‌కు చెందిన ఓ బృందం హాస్పిటల్ మార్చురీని కూడా పరిశీలించింది. శవాలను భద్రపరిచే ప్రొటోకాల్స్, పోస్ట్ మార్టంలు నిర్వహించే విధానాన్ని, మౌళిక సదుపాలు ఎలా ఉన్నాయో అనే దానిపై విచారణ చేసింది. అక్కడ ఉన్న ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. అయితే సందీప్ ఘోష్ హయాంలో.. ఆస్పత్రిలో గుర్తుతెలియని మృతదేహాలను రవాణా చేయడం, ఆర్థిక అవకతవకలకు పాల్పడడం, బయెమెడికల్ వ్యర్థాల తొలగింపులో అవినీతి జరగడం, కళాశాల నిర్మాణ టెండర్లలో బంధుప్రీతి చూపించడం వంటివి జరిగాయని.. మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఆరోపణలు చేశారు.
Also read: మరో 11జిల్లాలకు భారీ వర్ష సూచన.. ముందస్తు చర్యలపై సీఎస్ కీలక ఆదేశాలు!
మరోవైపు సీబీఐ బృందాలు హాస్పిటల్ స్టోర్ బిల్డింగ్‌లో కూడా తనిఖీలు చేపట్టాయి. జూనియర్ డాక్టర్ పనిచేసిన ఛాతి విభాగంలో కూడా పరిశీలించాయి. అలాగే హాస్పిటల్ సిబ్బందిని కూడా ఇంటర్వ్యూ చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను మాత్రమే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇతర వ్యక్తులు కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఎక్కువ మంది ఉన్నారని ఆరోపించారు.