ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్.... ఏకంగా తొమ్మిది బెయిల్ పిటిషన్ల తిరస్కరణ...!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీగా షాక్ లు తగులుతున్నాయి. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఇస్లామాబాద్ లోని స్థానిక కోర్టులు తిరస్కరించాయి. గతంలో జరిగిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించిన పీటీఐ కార్యకర్తలతో పాటు ఆయనపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

New Update
ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్.... ఏకంగా తొమ్మిది బెయిల్ పిటిషన్ల తిరస్కరణ...!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీగా షాక్ లు తగులుతున్నాయి. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఇస్లామాబాద్ లోని స్థానిక కోర్టులు తిరస్కరించాయి. గతంలో జరిగిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించిన పీటీఐ కార్యకర్తలతో పాటు ఆయనపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన తొమ్మిది బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి.

ఇటీవల పీటీఐ చేపట్టి ఆందోళనలు హింసాత్మకం అయ్యాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఖానా, బర్ఖాహ్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు ఆయన మూడు బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా ఇస్లామాబాద్ లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) తిరస్కరించింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన ఆరు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు సెషన్స్ జడ్జి (ఎడిఎస్‌జె) మహ్మద్ సోహైల్ వెల్లడించారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ బెయిల్‌ను పొడిగించలేమని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసుల దర్యాప్తు విషయంలో పోలీసులకు సహకరించాలని ఇమ్రాన్ ఖాన్ ను న్యాయమూర్తి ఆదేశించారు. ఇక తోషాఖానా కేసులో బోగస్ రశీదుకు సంబంధించిన కేసులో ఖాన్ భార్య బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబర్ 7 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.

అవినీతి ఆరోపణలపై ఈ ఏడాది మే9 న ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు రక్షణ, మిలటరీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారగ పోలీసులు రంగ ప్రవేశం చేసి అల్లర్లను అదుపులోకి తీసుకు వచ్చారు. హింసాత్మక నిరసనలకు ప్రధాన సూత్రధారి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని పోలీసులు అభియోగాలు మోపారు. పలువురు పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.

Advertisment
తాజా కథనాలు