ఎన్టీఆర్ వచ్చాక కమ్మ వారికి అధికారం వచ్చిందనేది సరికాదు.. ఉండవల్లి కీలక వ్యాఖ్యలు....!

రాజ్యాధికారంలో కాకతీయుల కాలం నుంచి కమ్మ,రెడ్లకు పట్టుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే కమ్మవారికి రాజ్యాధికారం వచ్చిందనేది కరెక్ట్ కాదన్నారు. కులం అన్నింటిలోనూ ఇప్పుడు ముఖ్యమైనదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు? పుస్తక సమీక్ష కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

New Update
ఎన్టీఆర్ వచ్చాక కమ్మ వారికి అధికారం వచ్చిందనేది సరికాదు.. ఉండవల్లి కీలక వ్యాఖ్యలు....!

రాజ్యాధికారంలో కాకతీయుల కాలం నుంచి కమ్మ,రెడ్లకు పట్టుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే కమ్మవారికి రాజ్యాధికారం వచ్చిందనేది కరెక్ట్ కాదన్నారు. కులం అన్నింటిలోనూ ఇప్పుడు ముఖ్యమైనదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు? పుస్తక సమీక్షకార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. 1952 నుంచే కమ్మ, రెడ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్నారు. 1952 తర్వాత కమ్మవారి ప్రాతినిధ్యం,ప్రాబల్యం లేని క్యాబినెట్ ఇదేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఉండేదన్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీలో కమ్మవారికే ప్రాధాన్యం ఉండేదని వెల్లడించారు.

వాళ్లు కూడా అలానే వ్యవహరించారని పేర్కొన్నారు. నాడు-నేడు కమ్మ,రెడ్లదే రాజకీయంగా ఆధిపత్యమన్నారు. ఏపీలో యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ మొదలుపెట్టింది త్రిపురనేని రామస్వామి చౌదరి అని తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న ఒత్తిడి కారణంగానే రంగా హత్య సమయంలో విధ్వంసం జరిగిందన్నారు. ఓటును వెయ్యికి, రెండు వేలకు అమ్మకుండా మనమే అడ్డుకోవాలన్నారు.

ఈ మధ్య కొత్త సంస్కృతి మొదలైందన్నారు. అపార్ట్ మెంట్లలో ఉన్నవారంతా హోల్ సేల్ గా బేరం మాట్లాడేసుకుంటున్నారని చెప్పారు. అధికారంలోకి రావడానికే రాజకీయాలు అనే పరిస్థితి పోవాలన్నారు. ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవికి 16 శాతం ఓట్లు వచ్చాయన్నారు. పార్టీని కాపాడుకోవాలని చిరంజీవికి చెప్పానన్నారు. పార్టీని విలీనం చేసే సమయంలోనూ బయటి నుంచి మద్దతివ్వండి కానీ కలపొద్దని చెప్పానన్నారు.

అధికారంలోకి రావడానికే రాజకీయాలొద్దనేదే తన సూచనన్నారు. రుషిసనక్ ఇక్కడ పోటీ చేసి వార్డు మెంబర్ గా గెలవమని చెప్పండి చూద్దామన్నారు. ఆయన గెలవలేడన్నారు. మన దగ్గర చదువుకున్నవాడి కంటే కులానికే ప్రాధాన్యం ఎక్కువన్నారు. ఏపీ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు పుస్తకం ద్వారా కచ్చితంగా మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు