EX MP Harsha: ' షర్మిలకు పగ్గాలు ఇవ్వొద్దు.. జగన్ షర్మిల ఒక్కటే'.. మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు ఇవ్వొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. జగన్ షర్మిల ఒక్కటేనన్నారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని కామెంట్స్ చేశారు. ఆమె కంటే సమర్థులైన నాయకులు ఏపీలో లేరా అని ప్రశ్నించారు.

EX MP Harsha: ' షర్మిలకు పగ్గాలు ఇవ్వొద్దు.. జగన్ షర్మిల ఒక్కటే'.. మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
New Update

EX MP Harsha Kumar: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు ఇవ్వొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందంటూ కామెంట్స్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులు లేరా..? అని ప్రశ్నించారు. నేను రాజన్న బిడ్డని.. నేను హైదరాబాదులో పుట్టాను.. హైదరాబాదులో చదువుకున్నాను.. హైదరాబాదులోనే రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను.. అని క్లియర్ గా చెప్పిన షర్మిల హైదరాబాదులో ఎన్నికలు వచ్చేటప్పటికి పోటీ చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ కి బేషరత్తుగా సపోర్ట్ చేశారు సంతోషం..అయితే, కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా ఆమోదించలేదని వ్యాఖ్యనించారు.

Also Read: వ్యూహం సినిమాపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

బూడిదలో పూసిన పన్నీరే

తెలంగాణ బిడ్డ వైఎస్ షర్మిలకు ఆంధ్రాలో పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపడితే బూడిదలో పూసిన పన్నీరే అవుతాయన్నారు. తెలంగాణలో లీడర్షిప్ చేసి.. తెలంగాణ కావాలనుకున్న ఆమెను తీసుకువచ్చి పెడితే.. ఆంధ్ర వాళ్లకు ఆత్మ అభిమానం దెబ్బతింటుందన్నారు. తెలంగాణ నాయకులకే లీడర్షిప్ ఇస్తారా? అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు.

జగన్ షర్మిల ఒకటే

వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయినట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం ఎందుకు పడుతుందంటూ ప్రశ్నించారు. జగన్ షర్మిల ఒకటేనని అన్నారు. ఢిల్లీలో ఏం మాట్లాడాలి.. ఢిల్లీలో ఎలా మెలగాలి..కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ ఉండాలి.. అక్కడ నుంచి ఏమి హామీలు తీసుకోవాలి అని ట్రైనింగ్ ఇచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి పంపించాడన్నారు.

అధిష్టానం ఆలోచించాలి

నేను మోడీని చూసుకుంటాను.. నువ్వ సోనియాని చూసుకో..రేపొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్ గా ఉంటాం అనే ఉద్దేశం తప్పితే ఇంకోటి కనబడడం లేదని కామెంట్స్ చేశారు. అందుకనే కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలించమని కోరుతున్నానని.. షర్మిలకి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే వచ్చే పరిణామాల గురించి ఆలోచించాలనే ఇలా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

#andhra-pradesh #sharmila #ex-mp-harsha-kumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe