Telangana: ప్రజాభవన్‌ యాక్సిడెంట్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. కొడుకుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే షకీల్..

ఇటీవల ప్రజాభవన్ (పాత ప్రగతి భవన్) ముందు కారుతో బీభత్సం సృష్టించిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సాహిల్ దుబాయ్‌కు పారిపోయాడు. అతడు దుబాయ్ పారిపోయేందుకు తండ్రి షకీల్ సహకరించాడని పోలీసులు గుర్తించారు. సాహిల్‌ను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

New Update
Telangana: ప్రజాభవన్‌ యాక్సిడెంట్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. కొడుకుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే షకీల్..

ఇటీవల హైదరాబాద్‌లో ప్రజాభవన్ (పాత ప్రగతి భవన్) ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీసులు ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియస్ రాహిల్ దుబాయక్‌కు పారిపోయేందుకు షకీల్ సహకరించాడని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగాగ.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది వరకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.

Also Read: ‘రాష్ట్రం పరువు తీయకు’.. సీఎం రేవంత్‌కు దాసోజు శ్రవణ్ వార్నింగ్..

మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా తన కొడుకుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. మరో విషయం ఏటంటే సాహిల్‌పై పోలీసులు ఇప్పటికే లుక్ అవట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌కు పారిపోయిన అతడ్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏం జరిగింది
గత నెల 23న సాహిల్ ప్రజాభవన్ ముందు కారుతో బీభత్సం సృష్టించాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ వద్ద ఉన్న బారీకేడ్లను ఢీకొట్టి ధ్వంసం చేశాడు. అయితే ఈ సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేవు. కారు ప్రమాదం విజువల్స్ చివరికి సీసీ టీవీ కెమెరాల్లో దొరికాయి. దీంతో పోలీసులు కేసు నమోదు సాహిల్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను కూడా సస్పెండ్ చేశారు.

Also read; అయోధ్య రామమందిరంపై కర్ణాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు