ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్.. బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మాల్ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రీఓపెన్ అయ్యింది. జీవన్ రెడ్డి బకాయిలు చెల్లించని కారణంగా మే 16న ఆర్టీసీ అధికారులు మాల్‌ను సీజ్ చేశారు. దీంతో ఆ మాల్‌లో కార్యకలాపాలు చేస్తున్న రిలయన్స్, కేఎఫ్‌సీ, ట్రెండ్స్, పీవీఆర్ కంపెనీలకు కూడా పెద్ద ఎత్తున లాస్ వచ్చింది. దాదాపు రూ.కోటీ నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశాయి.
Also Read: కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు.. హరీష్ రావు ఫైర్
అయితే ఈ మాల్‌కు సంబంధించి జీవన్ రెడ్డి రూ.3.14 కోట్ల బకాయిలు ఆర్టీసీ సంస్థకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని 3 నెలల క్రితమే అధికారులు జీవన్ రెడ్డికి నోటీసులు పంపారు. నోటీసులకు స్పందించకపోతే మాల్‌ను సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో మాల్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. బకాయిలు చెల్లించేందుకు న్యాయస్థానం నెల రోజుల గడువు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఇటీవలే ఆర్టీసీ అధికారులు, పోలీసులు జీవన్‌రెడ్డి మాల్‌ను సీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ మాల్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించగా.. చివరకి మధ్యంతర ఉత్తర్వులతో మాల్ మళ్లీ తెరుచుకుంది.
Also Read: విదేశాల్లో తెలుగు విద్యార్థులు మృత్యువాత